ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kalyan Ram: చేతిపై భార్య పచ్చబొట్టు.. గుట్టు విప్పిన కల్యాణ్‌రామ్‌!

ABN, First Publish Date - 2023-02-07T19:44:12+05:30

వ్యక్తిగత విషయాల గురించి మీడియా ముందు ఎప్పుడూ ప్రస్తావించని నందమూరి కళ్యాణ్‌ రామ్‌ (nandamuri Kalyanram) మొదటిసారి ఆయన భార్య గురించి మాట్లాడారు. ఆమె గొప్పతనాన్ని వివరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వ్యక్తిగత విషయాల గురించి మీడియా ముందు ఎప్పుడూ ప్రస్తావించని నందమూరి కళ్యాణ్‌ రామ్‌ (nandamuri Kalyanram) మొదటిసారి ఆయన భార్య గురించి మాట్లాడారు. ఆమె గొప్పతనాన్ని వివరించారు. ఆయన త్రిపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ‘అమిగోస్‌’(amigos). రాజేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కల్యాణ్‌రామ్‌ ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భార్య స్వాతి (Swathi tatoo story)గురించి, తన చేతిపై ఉన్న పచ్చబొట్టు గురించి తొలిసారి చెప్పారు. Kalyan ram about his wife tatoo story)

Untitled-1.jpg

‘‘ఎవరైనా తల్లి పేరు, లవర్‌ పేరు టాటూ వేయించుకుంటారు. మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి కదా? మీ భార్య పేరు టాటూ వేయించుకోవడానికి కారణమేంటి? అని అడగగా.. ‘‘2007- 2008 సమయంలో నాకు ఆరోగ్య సమస్యలొచ్చాయి. అన్నీ ఇప్పుడు కాస్త ఇబ్బందే! ఆ సమయంలో నా ఆరోగ్యం అసలు బాగోలేదు. అలాంటి సమయంలో ఏ భార్య అయినా భర్తకు సేవలు చేస్తుంటారు. కొందరైతే నర్స్‌ను పెట్టి చూసుకోమని చెప్పేస్తారు. కానీ నా భార్య అలా చేయలేదు. నర్సును కూడా వద్దని అతి క్లిష్టమైన ఆ సమయంలో తానే దగ్గరుండి నాకు సేవలు చేసింది. ఓ తల్లి బిడ్డను ఎలా చూసుకుంటుందో అలా చూసుకొని నన్ను ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దింది. అది నా మనసుకు బాగా తాకింది. మా పదవ పెళ్లి రోజున ‘నీకేం కావాలి.. ఏదైనా ఇస్తాను’ అని అడిగాను. తను మాత్రం ‘నాకేం వద్దు.. నాకు అన్ని ఉన్నాయి.. పక్కన మీరూ, పిల్లలు ఉన్నారు. అంతకుమించి ఇంకేం కావాలి’’ అని చెప్పింది. నా భార్యపై ఉన్న ప్రేమతో తన పేరును టాటూగా వేయించుకున్నాను. అసలు నాకు సూది అంటే చాలా భయం. ఇంజెక్షన్‌ చేయించుకోవాలన్న భయపడతాను. ఆ భయాన్ని ఆమె మీద ఉన్న ఇష్టం ఓవర్‌ కమ్‌ చేసింది. అలా ఈ టాటూ నా చేతి మీదకొచ్చింది. నిజంగా నా భార్య లేకపోతే నేను లేను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2023-02-07T19:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!