ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crab Curry: ఈ పీతల కూరను బంగారంతో చేశారా ఏంటి..? తిన్నాక రేటు విని నోరెళ్లబెట్టిన కస్టమర్.. చివరకు రచ్చ రచ్చ..!

ABN, First Publish Date - 2023-09-21T21:28:49+05:30

విదేశాల్లో పర్యటించడం ఓ అద్భుత అనుభూతిని ఇస్తుంది. కానీ, కొన్ని సార్లే ఇవే విదేశీ టూర్లు జీవితాంతం గుర్తుండిపోయే చేదు జ్ఞాపకాలు మిగులుస్తాయి. ఇటీవల సింగపూర్‌లో పర్యటించిన ఓ విదేశీ మహిళకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో పర్యటించడం ఓ అద్భుత అనుభూతిని ఇస్తుంది. కానీ, కొన్ని సార్లే ఇవే విదేశీ టూర్లు జీవితాంతం గుర్తుండిపోయే చేదు జ్ఞాపకాలు మిగులుస్తాయి. ఇటీవల సింగపూర్‌లో పర్యటించిన ఓ విదేశీ మహిళకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే, బాధితురాలు తన ముగ్గురు స్నేహితులతో కలిసి సింగపూర్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లింది. ఓ పీతల వంటకానికి అది చాలా ఫేమస్.


ఆర్డర్ తీసుకునేందుకు ఆ స్నేహితుల వద్దకు వచ్చిన వెయిటర్ పీతల వంటకం అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. ఒక్కసారి ట్రై చేస్తే ఇక వదిలిపెట్టరని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ వంటకం రేటు విషయంలో మాత్రం కాస్తంత గజిబిజి చోటుచేసుకుంది. పీత వంటకం బాగా నచ్చడంతో వారు ఎంజాయ్ చేశారు. ఆ తరువాత బిల్లు చూశాక వారికి దిమ్మతిరిగినంత పనైంది. కారణం.. ఆ వంటకం చార్జి ఏకంగా రూ.56 వేలు.దీంతో, మహిళ రెస్టారెంట్ వారిపై ఇంతెత్తున లేచింది. వంట కేవలం 20 డాలర్లని చెప్పిన వారు అది వంద గ్రాముల రేటు అన్న విషయం చెప్పలేదని ఆరోపించింది. ఇది చాలదన్నట్టు ఒక పీతమొత్తాన్ని తమకోసం తెచ్చారని అది ఏకంగా మూడున్నరకిలోల బరువుందని చెప్పింది. చేసిందంతా చేశాక చివరకు 56 వేల బిల్లు వేశారంటూ మండిపడింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు(Japanese woman paid rs 50 thousand for crab dish in singapore)


కానీ రెస్టారెంట్ వారు మాత్రం మహిళ ఆరోపణలు కొట్టివేశారు. వంట గురించి వివరించే సమయంలో అన్ని విషయాలు కూలంకషంగా వెల్లడించామని చెప్పుకొచ్చారు. తన స్టాఫ్‌ను తామూ పూర్తిగా విశ్వసిస్తున్నామని, వారు అబద్ధం చెప్పరని వాదించారు. చివరకు పోలీసులు రాజీ కుదర్చడంతో రెస్టారెంట్ వారు ఆమెకు ఆరు వేల రూపాయల డిస్కౌంట్ ఇచ్చి మిగతా మొత్తాన్ని తీసుకున్నారు.

Updated Date - 2023-09-21T21:28:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising