అది మన దేశంలోని 9 రాష్ట్రాలను కలిపే రైలు... దిబ్రూఘర్‌లో ప్రయాణం మొదలు పెట్టి ఎక్కడకు చేరుకుంటుందంటే...
ABN, First Publish Date - 2023-03-11T12:20:52+05:30
Indian Railway: మనదేశంలోని రైలు నెట్‌వర్క్(Rail network) అత్యధికశాతం ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. మనదేశంలోని కొన్ని రైళ్లు చాలా దూరం ప్రయాణిస్తాయి.
Indian Railway: మనదేశంలోని రైలు నెట్‌వర్క్(Rail network) అత్యధికశాతం ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. మనదేశంలోని కొన్ని రైళ్లు చాలా దూరం ప్రయాణిస్తాయి. రైలు ప్రయాణం(train journey) ఎంతో వినోదాత్మకంగా అనిపిస్తుంది. భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అని కూడా అంటారు.
దేశ జనాభాలో అత్యధికశాతం(highest percentage) మంది రైలులోనే తమ ప్రయాణాలు సాగిస్తుంటారు. ఎందుకంటే రైలు ప్రయాణం ఎంతో చౌక అయినది. సురక్షితమైనది(safe)గానూ పేరొందింది. మన దేశంలో లక్షల కిలోమీటర్ల మేర రైలు నెట్‌వర్క్ ఉంది. ఈ అనుసంధానంతో వందల రైళ్లు నడుస్తుంటాయి. మనదేశంలో, విదేశాల్లో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 9259 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ట్రాన్స్-సైబీరియన్ రైలు నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఇది రష్యాలోని సైబీరియా ప్రాంతం గుండా వెళుతూ రష్యా రాజధాని మాస్కో(Moscow)ను సుదూర తూర్పు నగరమైన వ్లాడివోస్టాక్‌తో కలుపుతుంది.
ఈ మార్గంలో రైలు ప్రారంభ స్టేషన్ నుండి చివరి స్టేషన్ వరకు అనేక ప్రాంతాలను దాటుతుంది. బైకాల్ సరస్సు, సైబీరియా(Siberia) అడవులు పలు పర్వతాలు ఈ మార్గంలో ప్రయాణికులను అలరిస్తాయి. కెనడాకు చెందిన ఈ రైల్వే మార్గం ఉత్తర అమెరికా(North America)లో పొడవైన రైల్వే మార్గం. రైలు మొదటి స్థానం నుండి చివరి స్థానం చేరుకునేందుకు దాదాపు 2 రోజులు పడుతుంది. కాగా వివేక్ ఎక్స్‌ప్రెస్(Vivek Express) భారతదేశంలోనే అత్యంత సుదూరం ప్రయాణించే రైలు.
ఈ రైలు దిబ్రూఘర్ నుండి కన్యాకుమారి(Kanyakumari) వరకు నడుస్తుంది. ఈ రైలు తిరువనంతపురం, కోయంబత్తూర్, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ తదితర ప్రాంతాల మీదుగా వెళుతుంది. ఈ రైలు దాదాపు 23 కోచ్‌లతో నడుస్తుంది. ఈ రైలు 4234 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలును 2011, నవంబరు 19న ప్రారంభించారు. వివేక్ ఎక్స్‌ప్రెస్ 9 రాష్ట్రాల మీదుగా వెళుతుంది. ఇది భారతీయ రైల్వే(Indian Railways)లో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందింది.
Updated Date - 2023-03-11T12:31:40+05:30 IST