భార్యకు వివాహేతర సంబంధం ఉందని అతని అనుమానం.. ఒకరోజు ఫుల్లుగా తాగివచ్చి ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే...
ABN, First Publish Date - 2023-02-21T10:33:37+05:30
దేశ రాజధాని ఢిల్లీలోని షకుర్‌పూర్ ప్రాంతంలో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 24 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఏడాదిన్నర కుమారుడిని పదునైన ఆయుధంతో హతమార్చాడు.
దేశ రాజధాని ఢిల్లీలోని షకుర్‌పూర్ ప్రాంతంలో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 24 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఏడాదిన్నర కుమారుడిని పదునైన ఆయుధంతో హతమార్చాడు. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాకు చెందిన బ్రిజేష్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటలకు సుభాష్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చింది. అనంతరం పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. రక్తమోడుతున్న తల్లీకొడుకులను ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బ్రిజేష్ తన కుటుంబంతో కలిసి షకుర్‌పూర్‌లో నివసిస్తున్నట్లు విచారణలో తేలిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పదునైన ఆయుధంతో 24 ఏళ్ల భార్య, పసికందును హత్య చేశాడు. బ్రిజేష్ 2016లో ఈమెను వివాహం చేసుకున్నాడని, మద్యానికి బానిసైన బ్రిజేష్ తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడని అధికారి తెలిపారు. బ్రిజేష్‌కు మరో 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడని అధికారి తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
Updated Date - 2023-02-21T10:33:49+05:30 IST