ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking Video: చావుకు హాయ్ చెప్పి రావడమంటే ఇదేనేమో.. ఒక్క క్షణం ఆలస్యమైనా ఈ ఇద్దరు కుర్రాళ్ల ప్రాణాలు పోయేవే..!

ABN, First Publish Date - 2023-10-06T18:42:08+05:30

ఓ హోటల్‌లో ఈబైక్ బ్యాటరీ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీ పేలబోతోందని గుర్తించి సరైన సమయంలో పరుగు లంఘించుకున్న యువకులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సిడ్నీలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: మరణం ఎప్పుడు ఎక్కడి నుంచి ముంచుకువస్తుందో తెలీదు. అటువంటి సందర్భాల్లో ప్రాణాలతో బయటపడటం అంటే మామూలు విషయం కాదు. తాజాగా ఇద్దరు సరిగ్గా ఇలాంటి ప్రాణాపాయం నుంచే తృటిలో తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా(Viral Video) అవుతూ నెటిజన్లను కంగారు పెడుతోంది. వెంట్రుకవాసిలో కుర్రాళ్లు ప్రాణాలతో బయటపడ్డందుకు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చావుకు హాయ్ చెప్పి రావడం అంటే ఇదే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..


ఆస్ట్రేలియాలోని(Australia) సిడ్నీలో(Sydney) ఈ ఘటన వెలుగు చూసింది. ఈబైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో తమ బైక్ చార్జింగ్ పెట్టారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా బ్యాటరీలో మంటలు చెలరేగడం ప్రారంభించాయి. ఇది చూసిన వెంటనే అప్రమత్తమైన యువకులు ఇద్దరూ ఒక్కసారిగా పరుగు లంఘించుకున్నారు. వారు గది దాటుతున్న తరుణంలోనే బ్యాటరీ పెద్దశబ్దంతో పేలిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరో క్షణం ఆలస్యం జరిగి ఉంటే ఆ కుర్రాళ్లు మంటల్లో చిక్కుకునే వారే! ఏ దేవుడో కరుణించడంతో వారు సరైన సమయంలో అక్కడి నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు(Two youths had lucky escape after battery in ebike explodes while charging). ఆ తరువాత మంటలు హోటల్ మొత్తం వ్యాపించడంతో అక్కడున్న దాదాపు 70 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.


కాగా, ఈ ఘటనలో ఓ కుర్రాడికి కాలిపై స్వల్పస్థాయి గాయాలు అయినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. అతడికి సమీపంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించినట్టు చెప్పుకొచ్చారు. ఈ ఘటన తాలూకు వీడియోను అక్కడి అగ్నిమాపక సిబ్బంది నెట్టింట్లో షేర్ చేయడంతో ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది. నెటిజన్లను నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

Updated Date - 2023-10-06T18:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising