ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా ఇన్‌స్పెక్టర్.. ముగ్గురు పిల్లలకు తల్లి.. ఓ కేసు విచారణకు వెళ్లిన ఈమె ఎలా చనిపోయిందో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-05-06T16:02:40+05:30

ఆమె ఓ ఇన్‌స్పెక్టర్.. ముగ్గురు పిల్లల తల్లి. విధి నిర్వహణపై నిబద్ధత కలిగిన ఆమె తన వ్యక్తిత్వంతో తోటి ఉద్యోగులు, పై అధికారుల మెప్పు కూడా పొందింది. కానీ, వృత్తి జీవితంలో దూసుకుపోతున్న ఆమెను అకాల మరణం వెంటాడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆమె ఓ ఇన్‌స్పెక్టర్.. ముగ్గురు పిల్లల తల్లి. విధి నిర్వహణపై నిబద్ధత కలిగిన ఆమె తన వ్యక్తిత్వంతో తోటి ఉద్యోగులు, పై అధికారుల మెప్పు కూడా పొందింది. కానీ, వృత్తి జీవితంలో దూసుకుపోతున్న ఆమెను అకాల మరణం వెంటాడింది. ఓ కేసు విచారణకు వెళ్లిన ఆమె అనూహ్యంగా మరణించడంతో హరియాణాలోని(Haryana) పంచ్‌కుల మహిళా పోలిస్ స్టేషన్‌ను(Panchkula Police station) విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ సహోద్యోగిని అకస్మా్త్తుగా కోల్పోయిన సిబ్బంది నోట మాట లేకుండా అయిపోయింది.

హరియాణాకు చెందిన లేడీ ఇన్‌స్పెక్టర్ నేహా చౌహాన్ (Neha Chauhan) పంచకుల మహిళా పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ముగ్గురు సంతానం. పెద్ద సంతానం వయసు తొమ్మిదేళ్లు. కాగా, ఓ కేసుకు సంబంధించి మహారాష్ట్రలో సోదాల కోసం నేహా చౌహాన్ వెళ్లింది. ఆ తరువాత తిరిగి వస్తున్న సమయంలో మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేహ ప్రయాణిస్తున్న జీపు డ్రైవర్‌ ఓ ట్రక్‌ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రెండు వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాల పాలైన నేహా చౌహాన్ చివరకు ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలంలోనే ఆమె మరణించారు.

నేహ మరణం ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధు మిత్రులను శోకసంద్రంలో తోసేసింది. తల్లిని కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తున్న చిన్నారులను ఊరడించడం ఎవ్వరితరం కాలేదు. ఇంతకాలం తమతో స్నేహంగా మెలిగిన నేహ ఇక లేదని తెలిసి సహోద్యోగులు తీవ్ర విచారంలో కూరుకుపోయారు. నేహను గుర్తు చేసుకుని కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. హరియాణా పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు నేహ మరణంపై విచారం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-06T16:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising