ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hair loss: జుట్టు రాలడం నుంచి మొటిమల వరకు.. ఇవన్నీ చలికాలంలోనే ఎక్కువగా ఎందుకు జరుగుతాయంటే..

ABN, First Publish Date - 2023-01-13T15:49:59+05:30

జుట్టురాలడం మాత్రమే కాకుండా మొటిమలు, మచ్చలు, కంటి ఇన్పెక్షన్లు మొదలైనవి చలికాలంలో ఎక్కువగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళలను వేధించే సమస్యలలో మొటిమలు, జుట్టు రాలడం, ఇతర చర్మసంబంధ సమస్యలు ఉంటాయి. మరీ ముఖ్యంగా మహిళలకు జుట్టు అంటే చాలా సెంటిమెంట్. జుట్టు రాలడం ఏమాత్రం ఎక్కువైనా చాలా కంగారు పడిపోతారు. కొంతమంది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న కారణంగా డిప్రెషన్ లోకి వెళ్ళడం అక్కడక్కడా తెలుస్తూనే ఉంటుంది. అయితే కేవలం జుట్టురాలడం మాత్రమే కాకుండా మొటిమలు, మచ్చలు, కంటి ఇన్పెక్షన్లు మొదలైనవి చలికాలంలో ఎక్కువగా ఎదురవుతాయి. ఇవన్నీ చలికాలంలోనే ఎందుకు ఎక్కువ అవుతాయి అనే కారణం తెలుసుకుంటే..

చలికాలంలో సహజంగా ఎదురయ్యే జుట్టు సంబంధిత సమస్య చుండ్రు. దీన్ని వైద్య పరిభాషలో పిట్రియాసిస్ కాపిటిస్ అని పిలుస్తారు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఇది రావడానికి కారణాలు ఎన్ని ఉన్నా తలలో మాడు భాగం మీద తెల్లని పుప్పొడిలాగా లేచి అది క్రమంగా పెరిగి చెప్పలేనంత ఇబ్బంది పెడుతుంది. సాధారణంగా జిడ్డు చర్మం కలవారి తల మాడులో సహజంగానే ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అయ్యే నూనెల వల్ల జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. తల మాడును, వెంట్రుకలను తరచుగా శుభ్రం చేయకుండా అలాగే వదిలెయ్యడం చాలా మంది ఈ చలికాలంలో చేసే పని. చలి ఎక్కువ ఉందనే కారణంతో తలస్నానం చేయకపోవడం, ముఖాన్ని సరిగ్గా కడగకపోడం వంటి అలవాట్ల వల్ల తలలో చుండ్రు, ముఖం మీద మొటిమలు వస్తాయి.

మరికొందరిలో చర్మం పొడిగానూ, సున్నితంగానూ ఉంటుంది. అందుకే తలలో చర్మం తొందరగా ప్రభావానికి గురయ్యి తలలో చుండ్రు, ముఖం మీద మొటిమలు వంటి సమస్యలకు కారణం అవుతుంది. తల స్నానం చెయ్యని మిగతా రోజులలో తలకు బాగా నూనె పెట్టడం చాలా మంది చేసే పొరపాటు. దీనివల్ల చుండ్రు ప్రభావం పెరుగుతుంది. కొంతమందిలో కనురెప్పలు, కనుబొమ్మలు మొదలైన ప్రాంతాలలో కూడా చుండ్రు రావడం గమనిస్తూ ఉంటాం. అయితే చుండ్రు రాలి అది కనుబొమ్మలు, కనురెప్పల మీద పడి గడ్డకట్టిపోయి ఉంటుంది. ఇదే కంటి ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. దీన్ని వైద్యపరిభాషలో సెబొర్హెయిక్ డెర్మటైటిస్ అని అంటారు. ఇది మలాసెజియా అనే ఫంగస్ వల్ల వస్తుంది.

చుండ్రు కేవలం జుట్టు కోల్పోవడానికి మాత్రమే కారణం కాదు. దీంతో పాటు చర్మసంబంధ సమస్యలను కలిగిస్తుంది. పైన చెప్పుకున్న మలాసెజియా అనే ఫంగస్ చర్మం మీద ప్రభావం చూపిస్తుంది. ఇది ముఖం మీద తెల్లని మచ్చలకు కారణం అవుతుంది. అంతేకాకుండా చుండ్రు వల్ల ముఖం, చెవులు, కనుబొమ్మలు, మొదలైన ప్రాంతాలలో దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్య పెరిగితే అది కాస్తా తామర, సొరియాసిస్ వంటి చర్మసంబంధ వ్యాధులకు కారణం అవుతుంది. ఇలా ఒక్క డాండ్రఫ్ సమస్య ఇతర సమస్యలను వెంటబెట్టుకుని వస్తుంది. డాండ్రఫ్ గురించి సరైన శ్రద్ద తీసుకోకపోతే హెయిర్ ఫాల్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది కాబట్టి చలికాలంలో డాండ్రఫ్ విషయంలో తగినంత శ్రద్ద అవసరం.

Updated Date - 2023-01-13T15:50:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising