ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

flying fish: ఈ తరహా చేపలను ఎక్కడా చూసుండరు... అవి అలాంటి చేష్టలు చేస్తాయంటే అస్సలు నమ్మరు!

ABN, First Publish Date - 2023-03-19T10:21:43+05:30

flying fish: చేపలు నీటిలోనే జీవిస్తాయనే విషయం మనకు తెలిసిందే. అయితే గాలిలో ఎగరగలిగే(fly) కొన్ని ప్రత్యేకమైన చేపలు కూడా ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? అయితే పక్షుల మాదిరిగా అవి చాలా ఎత్తు ఎగరలేవు. ఈ తరహా చేపలు 200 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే ఎగరగలవు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

flying fish: చేపలు నీటిలోనే జీవిస్తాయనే విషయం మనకు తెలిసిందే. అయితే గాలిలో ఎగరగలిగే(fly) కొన్ని ప్రత్యేకమైన చేపలు కూడా ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? అయితే పక్షుల మాదిరిగా అవి చాలా ఎత్తు ఎగరలేవు. ఈ తరహా చేపలు 200 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే ఎగరగలవు. ఈ చేపలకు రెక్కలు(wings) కూడా ఉంటాయి. వీటి సహాయంతోనే అవి ఎగురుతాయి. ఈ రెక్కలు నీటిలో అవి ఈత(swimming) కొట్టేందుకు కూడా సహాయపడతాయి.

ఈ చేపల పొడవు 17 సెం.మీ నుండి 30 సెం.మీ. మధ్య ఉంటుంది. ఇతర చేపల నుండి తప్పించుకునేందుకు అవి గాలిలో ఎగురుతాయి, తద్వారా అవి ఆ హానికారక చేపల(Harmful fish) నుండి తప్పించుకుంటాయి. ఈ చేపలు పొడవు పెరిగే కొద్దీ సన్నగా మారతాయి. ఈ చేపలను గ్లైడర్స్ అని పిలుస్తారు. అవి నీటి నుండి బయటకు వచ్చిన తర్వాత, గాలిలో ఎగిరి తిరిగి నీటిలోకి చేరుకుంటాయి.

అవి 200 మీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంటాయి(traveling). 6 మీటర్ల ఎత్తు వరకూ ఎగురుతాయి. ఈ చేపల ప్రత్యేకత ఏమిటంటే అవి నీటి లోపల, వెలుపల చక్కగా చూడగలుగుతాయి. కాగా ఈ చేపలు 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత(temperature) ఉన్నప్పుడు, అంత ప్రభావవంతంగా ఎగరలేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి కారణం వాటి కండరాలు(muscles) తక్కువ ఉష్ణోగ్రతలలో బలహీనపడతాయి. ఈ తరహా చేపను 'ఎగిరే చేప' అని అంటారు.

Updated Date - 2023-03-19T10:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising