ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: ఇంత పొద్దెక్కినా వీళ్లు నిద్రలేవలేదేంటని పక్కింటి వ్యక్తికి డౌట్.. పిలిచినా.. ఫోన్ చేసినా ఇంట్లోంచి నో రెస్పాన్స్.. చివరకు..!

ABN, First Publish Date - 2023-06-26T23:22:02+05:30

మధ్యప్రదేశ్ జబల్‌పూర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంది. తొలుత ఆ భార్యభర్తలు తమ కుమారుడికి ఉరివేసి ఆపై తామూ ఆత్మహత్య చేసుకున్నారు. మరునాడు ఉదయం వారు ఎంతకీ ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో పొరుగు ఇంటి వ్యక్తికి అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఇల్లు సడెన్‌గా మూగబోయినట్టు అనిపించింది. ఇంట్లో అలికిడేమీ వినిపించట్లేదు. ఇంత పొద్దెక్కినా వీళ్లు నిద్రలేవలేదేంటని పక్కింటి వ్యక్తికి డౌటొచ్చింది. చివరకు అతడు వెళ్లి ఇంటి తలుపు తట్టాడు. కానీ లోపలి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. పలుమార్లు ఇంటి తలుపు తట్టినా ఎవరూ బయటకు రాకపోవడంతో చివరకు అతడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ జబల్‌పూర్ జిల్లా రామ్‌పూర్ ఛపర్ ప్రాంతంలో నివసించే రవిశంకర్ బర్మన్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తుంటాడు. అతడికి భార్య పూనమ్, కుమారుడు ఆర్యన్ ఉన్నారు. శుక్రవారం ఎప్పటిలాగే నిద్రకు ఉపక్రమించిన వారు ఆ రాత్రే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పొరుగింటి వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత ఆ దంపతులు తమ కుమారుడిని చంపి ఆపై ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, వారి మరణానికి కారణమేంటో మాత్రం తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పటిదాకా ఆనందంగా కనిపించిన ఆ కుటుంబం ఒక్కసారిగా బలవన్మరణానికి ఎందుకు పాల్పడిందో అర్థంకాక ఇరుగుపొరుగు వారు విచారంలో కూరుకుపోయారు.

Updated Date - 2023-06-26T23:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising