ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking News: ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వల్ల ఈ కుర్రాడి ప్రాణమే పోయింది.. లైకు, కామెంట్ వంటివి ఏమీ చేయకపోయినా..!

ABN, First Publish Date - 2023-09-26T16:55:04+05:30

ఓ యువతి ఇన్‌స్టాగ్రాం ఫొటో కారణంగా ఇద్దరు యువకుల మధ్య మొదలైన గొడవ ఓ యువకుడి హత్యకు దారి తీసింది. చత్తీస్‌ఘడ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: స్నేహితుడు పిలిస్తే పార్టీకి వెళ్లిన ఓ యువతి అక్కడ తను మ్యాగీ తింటుండగా తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టింది. అది సాధారణ ఫొటోనే కానీ ఆ పార్టీ ఇచ్చిన యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. ఛత్తీస్‌ఘడ్‌లో(Chhattisgarh) వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనానికి దారి తీసింది. జష్‌పూర్ ప్రాంతానికి చెందిన నిఖిల్ గుప్తా తనకు స్నేహితులైన ఇద్దరు యువతులకు సెప్టెంబర్ 16న తన ఇంట్లోనే పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ యువతి తను మ్యాగీ తింటుండగా తీసుకున్న ఫొటో ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది(Insta photo of girl eating maggi).


యువతి నెట్టింట పోస్ట్ చేసిన ఆ ఫొటోను వికాస్ భగత్ అనే మరో యువకుడు చూశాడు. ఒకప్పుడు ప్రేమలో ఉన్న వారిద్దరూ ఆ తరువాత విడిపోయారు. కానీ, యువతి ఫొటోలోని నిఖిల్‌ను చూడగానే వికాస్ మనసులో కోపం కట్టలు తెంచుకుంది. అతడిలో అనేక రకాల అనుమానాలు మొదలయ్యాయి. ఉండబట్టలేకపోయిన అతడు చివరకు నిఖిల్‌కు ఫోన్ చేసి ఏం జరుగుతోందని ప్రశ్నించాడు. దీంతో, ఇద్దరు యువకుల మధ్య మాటామాటా పెరిగింది(Fight between boys lead to death of youth).


చివరకు ఇద్దరూ అదే రోజున తమ స్నేహితులను వెంటపెట్టుకుని ఓ చోటకు వెళ్లి గొడవపడ్డారు. ఈ క్రమంలో వికాస్ భగత్‌ నిఖిల్‌ను చావచితక కొట్టడంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ముఖమంతా గాయాలతో ఇంటికి తిరిగొచ్చిన అతడు కుటుంబసభ్యుల వద్ద అసలు విషయం దాచి పెట్టాడు. యాక్సిడెంట్లో గాయాలయ్యాయని చెప్పాడు. కానీ అదే రోజు అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు నిఖిల్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల తరువాత అతడు మృతి చెందాడు. ఈ క్రమంలో అసలు జరిగిందేంటో కుటుంబసభ్యులకూ తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం వికాస్ భగత్‌పాటూ అతడి స్నేహితులు అర్జున్, మలేయ్‌లను కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Updated Date - 2023-09-26T17:02:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising