ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని vs శతాబ్ధి: ఈ రైళ్ల టిక్కెట్లకు ఎందుకంత డిమాండ్?.. వీటిలో ప్రయాణికులకు అందే ప్రత్యేక సౌకర్యాలివే...

ABN, First Publish Date - 2023-04-03T09:40:45+05:30

భారతీయ రైళ్లు ప్రతీరోజూ లక్షల మందిని తమ గమ్యస్థానాలకు(destinations) చేరుస్తుంటాయి. అయితే కొన్ని రైళ్లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భారతీయ రైళ్లు ప్రతీరోజూ లక్షల మందిని తమ గమ్యస్థానాలకు(destinations) చేరుస్తుంటాయి. అయితే కొన్ని రైళ్లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిలో రాజధాని, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లు(Rajdhani and Shatabdi Express) కూడా ఉన్నాయి. రాజధాని ఎక్స్ ప్రెస్ వేగానికి మాత్రమే కాకుండా, భద్రత, సౌలభ్యం పరంగా కూడా అగ్రస్థానం(top)లో ఉంది. దీని సగటు వేగం గంటకు 130 కిలోమీటర్లు. గరిష్ట వేగం గంటకు 140 కిలోమీటర్లు. ఇది భారతదేశంలోని అత్యుత్తమ రైళ్ల(best trains)లో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఈ రైలు నడిచేందుకు ముందుగా ఒక ట్రాక్(A track) స్పష్టమైన రీతిలో కేటాయిస్తారు. తద్వారా ఈ రైలు సమయానికి గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు నిర్ణీత సమయానికే ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు పలు రికార్డులు(Records) చూపిస్తున్నాయి. ప్రయాణికులు దీనిని ఎక్కువగా ఇష్టపడటానికి ఇదే ప్రధానం కారణం.

దేశంలో మొదటి రాజధాని ఎక్స్‌ప్రెస్ 1969లో హౌరా నుండి న్యూఢిల్లీ(New Delhi) మధ్య నడిచింది. దేశంలో 24కు మించిన రాజధాని రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లు దేశ రాజధాని ఢిల్లీ నుండి ఇతర రాష్ట్రాల రాజధానులకు నడుస్తాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌(Rajdhani Express)లోని అన్ని కోచ్‌లు ఎయిర్ కండిషన్డ్ అయి ఉంటాయి. వాటి ఛార్జీలు కూడా సాధారణ రైళ్ల ఛార్జీల కంటే ఎక్కువగా ఉంటాయి.

ఇక శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు విషయానికి వస్తే 1988లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ(Pandit Jawaharlal Nehru) శత జయంతి సందర్భంగా ఈ పేరు పెట్టారు. మొదటి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు న్యూఢిల్లీ- ఝాన్సీ(New Delhi - Jhansi) మధ్య నడిచింది. సౌకర్యాల పరంగా చూస్తే రాజధాని తర్వాత శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్ కోచ్(Sleeper class coach) ఉండదు. ఇందులో AC చైర్ కార్, AC ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ సౌకర్యం ఉంటుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు సూపర్ ఫాస్ట్ కేటగిరీ రైలు(Super fast category train). దీని గరిష్ట వేగం 160 కి.మీ/గం. సగటు వేగం గంటకు 130 కి.మీ. భోపాల్(Bhopal) శతాబ్ది మనదేశంలోనే అత్యంత వేగంగా నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌గా గుర్తింపు పొందింది.

Updated Date - 2023-04-03T09:40:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising