ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అవునా..ఉప్పుతో గీసిన గీతను నాగుపాము దాటలేదా..?

ABN, First Publish Date - 2023-06-11T17:32:42+05:30

ఉప్పుతో గీసిన గీతను పాము దాటదన్న ప్రచారంలో నిజం లేదని నిరూపించాడో యూట్యూబర్. నెట్టింట వీడియో వైరల్.

ఇంటర్నెట్ డెస్క్: పాము పేరు చెబితే ఎవ్వరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఇక నాగు పాము పెరెత్తితే అక్కడి నుంచి పారిపోవాల్సిందే. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాముల్లో నాగు కూడా ఒకటి. అయితే, నిరక్షరాస్యత అధికంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నాగుపాముకు సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. వీటిని యథాతథంగా ఫాలో అయిన అనేక మంది ప్రాణాలు మీదకు కూడా తెచ్చుకున్నారు. అందులో ఒకటి ఉప్పుతో నాగబంధనం వేయడం! అవును.. ఇంటి చుట్టు ఉప్పును ఓ గీతలాగా జల్లితే దాన్ని దాటి నాగు లోపలికి రాదనే అపోహ కొన్ని ప్రాంతాల్లో బలంగా వేళ్లూనుకుంది. ఈ నమ్మకంలో నిజానిజాలు ఏంటో తేల్చేందుకు ఓ యూట్యూబర్ రంగంలోకి దిగాడు. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అతను చేసిన సాహసం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. అమిత్ కుమార్ అనే యూట్యూబర్ తొలుత ఉప్పును వలయాకారంలో ఓ గీతలా జల్లాడు. ఆ తరువాత వలయం మధ్యలో రెండు నాగుపాములను వదిలాడు. అయితే, ఓ నాగుపాము వెంటనే ఉప్పు గీతను దాటుకుని వలయం నుంచి బయటకు వచ్చేసింది. రెండో పాము మాత్రం కాసేపు ఆగి ఆ తరువాత అది కూడా బయటకు వచ్చేసింది. ఇదంతా చూసిన నెటిజన్లు అమిత్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అతడి ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నాయంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అన్నట్టు అమిత్ వీడియోకు ఇప్పటివరకూ మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆసక్తికరంగా ఈ వీడియోను మనం కూడా చూద్దామా!

Updated Date - 2023-06-11T17:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising