అర్థం తెలియకుండా ‘టాటా’ చెబుతున్నారా? వందల ఏళ్ల క్రితం పుట్టిన ఈ పదం తొలుత ఎప్పుడు వినియోగించారంటే...
ABN, First Publish Date - 2023-04-05T09:00:11+05:30
ఎవరైనా బయటకు వెళుతున్నప్పుడు టాటా(Tata) చెబుతుంటాం. ఇంతకీ టాటా అంటే ఏమిటి? దానిని ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం. టాటా అనేది ఆంగ్లంలో ఉపయోగించే పదం.
ఎవరైనా బయటకు వెళుతున్నప్పుడు టాటా(Tata) చెబుతుంటాం. ఇంతకీ టాటా అంటే ఏమిటి? దానిని ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం. టాటా అనేది ఆంగ్లంలో ఉపయోగించే పదం. బ్రిటీష్ ఇంగ్లీషు(British English) ప్రకారం టాటా అనే పదానికి వీడ్కోలు అని చాలా నిఘంటువులలో పేర్కొన్నారు. ఎవరైనా ఎవరికైనా వీడ్కోలు(Farewell) చెప్పినప్పుడు లేదా దూరమవుతున్నప్పుడు వీడ్కోలు చెబుతారు అప్పుడు టాటా అనే పదాన్ని ఉపయోగిస్తారు.
ఈ పదం 1823 సంవత్సరం నుంచి ఆంగ్లం(english)లో కనిపిస్తుంది. న్యూయార్క్ టైమ్స్ దీనిని 1889లో ఫెయిర్‌ఫెయిల్(Fairfail) అనే పదంగా ఉపయోగించింది. ఈ పదం 1940లో బాగా ప్రాచుర్యం(popularity) పొందింది. ఆ సమయంలో టాటా ఫర్ నౌ(Tata for Now)ను షార్ట్ రూపంలో చెప్పేందుకు టాటా అనే పదం వినియోగించారు. ఈ పదం ఆ సమయంలో ప్రసిద్ధ రేడియో షో(Radio show)లో ఉపయోగించారు. అప్పటి నుండి ఇది వాడుకలోకి వచ్చింది.
Updated Date - 2023-04-05T09:26:06+05:30 IST