ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dhanush: గృహ ప్రవేశం చేసిన ధనుష్.. ఇంటి ధర తెలిస్తే అవాక్కే..

ABN, First Publish Date - 2023-02-20T15:08:42+05:30

విభిన్న సినిమాలు, వైవిధ్య భరితమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’ (Asuran), ‘కర్ణన్’, ‘వడ చెన్నై’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్న సినిమాలు, వైవిధ్య భరితమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’ (Asuran), ‘కర్ణన్’, ‘వడ చెన్నై’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఆయన కొత్త ఇంటిలోకి గృహ ప్రవేశం చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులందరు విపరీతంగా షేర్ చేస్తున్నారు.

చెన్నైలోని విలాసవంతమైన ప్రాంతమైన పోయెస్ గార్డెన్స్‌(Poes Garden) లో ధనుష్ కొత్త ఇంటి నిర్మాణాన్ని 2021లోనే చేపట్టారు. ఆ భవంతి నిర్మాణం కొన్ని రోజుల క్రితమే పూర్తయింది. మహారావరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తన తల్లిదండ్రులతో కలసి ధనుష్ కొత్త ఇంటిలోకి గృహ ప్రవేశం చేశారు. ఈ ఇంటి విలువ రూ.150కోట్ల వరకు ఉంటుందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ధనుష్ ఈ ఇంటిని తన తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చినట్టు వదంతులు షికార్లు కొడుతున్నాయి. గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలను ధనుష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, డైరెక్టర్ సుబ్రమణ్యం శివ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘సోదరుడైన ధనుష్ కొత్త ఇల్లు దేవాలయం మాదిరి అనుభూతినిస్తుంది. పిల్లలు ఎవరైతే తమ తల్లిదండ్రులను స్వర్గం లాంటి ఇంటిలో ఉండేలా చూస్తారో వారు దేవుళ్లతో సమానం’’ అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సెలబ్రిటీలందరు చెన్నైలోని పోయెస్ గార్డెన్స్‌లోనే నివసిస్తారు. దివంగత జయలలిత, రజినీ కాంత్, క్రికెటర్ దినేష్ కార్తిక్, ఇంద్ర నూయి తదితరుల నివాసాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక ధనుష్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ‘సార్’ (Sir) సినిమాలో నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ‘సార్’ ధనుష్‌కు మొదటి డైరెక్ట్ తెలుగు చిత్రం.

Updated Date - 2023-02-20T15:08:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising