ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sir: ధనుష్ మొదటి సినిమాతో అదరగొడుతున్నాడు

ABN, First Publish Date - 2023-02-20T17:51:34+05:30

ప్రముఖ తమిళ నటుడు ధనుష్ (Dhanush) తెలుగులో 'సార్' (#Sir) అనే సినిమాతో గత వారం ఆరంగేట్రం చేసాడు. ఈ సినిమా క్రిటిక్స్ కి అంతగా నచ్చకపోయినప్పటికీ, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మాత్రం చాలా బాగా చేసింది అనే చెప్పాలి (#SirCollections)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ తమిళ నటుడు ధనుష్ (Dhanush) తెలుగులో 'సార్' (#Sir) అనే సినిమాతో గత వారం ఆరంగేట్రం చేసాడు. ఈ సినిమా క్రిటిక్స్ కి అంతగా నచ్చకపోయినప్పటికీ, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మాత్రం చాలా బాగా చేసింది అనే చెప్పాలి (#SirCollections). మూడు రోజులకు గానూ ఈ సినిమా తెలుగు వెర్షన్ సుమారు 16 కోట్ల (16crores) వరకు కలెక్ట్ చేసింది అని చెపుతున్నారు ట్రేడ్ అనలిస్ట్స్. అయితే శివరాత్రి పండగ కూడా బాగా కలిసి రావటం, దానికి తోడు ధనుష్ (#Dhanush) నటన అందరినీ ఆకట్టుకోవడం, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం (GV Prakash Kumar) కూడా ఈ సినిమాకి ఒక అదనపు ఆకర్షణ అవటం, ఇవన్నీ కల గలిపి సినిమాకి ప్లస్ గా మారాయి. (#SirCollections)

దానికి తోడు వేరే పెద్ద సినిమాలు ఏవీ లేకపోవటం తో ధనుష్ 'సార్' (#SirCollections) బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే చేసింది. ఒక తమిళ్ నటుడు నటించిన తెలుగు సినిమాకి ఇంతలా మూడు రోజుల్లో వ్యాపారం చెయ్యడం నిజంగా ఆశ్చర్యకరమే. వెంకీ అట్లూరి (Venky Atluri) దీనికి దర్శకుడు కాగా, సితార ఎంటర్ టైన్ మెంట్ నాగ వంశి (Naga Vamsi) దీనికి నిర్మాత. ఇది ధనుష్ మొదటి తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు ధనుష్ ని బాగా ఆదరించారు అని అర్థం అవుతోంది. విద్య వ్యాపారం అయిపొయింది అనే నేపధ్యం ఆధారంగా తీసిన సినిమా.

తెలుగులోనే కాకుండా తమిళం లో కూడా ఈ సినిమా బాగానే ఆడుతోంది. మొత్తం అన్ని భాషల్లోనూ కలిపి ఈ సినిమా మూడు రోజులకు గాని 50 కోట్లకు (50 crore) పైగా చేసిందని నిర్మాతలు చెపుతున్నారు. ఈ సినిమాలో 'మాస్టారూ మాస్టారూ ' అనే పాట బాగా హిట్ అయింది, విడుదలకి ముందు తరువాత కూడా. సంయుక్త (Samyuktha) ఇందులో కథానాయకురాలు, ఆమె ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయింది అంటున్నారు. 'బింబి సారా' (#Bimbisara), 'భీమ్లా నాయక్' (#BheemlaNayak), ఇప్పుడు 'సార్' (#Sir) తో సంయుక్త గోల్డెన్ లెగ్ అని, ఆమెకి ఇప్పుడు బాగా అవకాశాలు వచ్చే అవకాశం వుంది అంటున్నారు.

Updated Date - 2023-02-20T17:51:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising