ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఇదేం విచిత్రం బాబోయ్.. పార్క్ చేసి ఉన్న కారుపై ఆరో అంతస్థు నుంచి కింద పడిందో పిల్లి.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-06-02T18:54:59+05:30

ఆరో అంతస్తు నుంచి కారు అద్దంపై పడ్డ పిల్లి. అయినా దానికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇది నిజంగా అద్భుతమని వ్యాఖ్యానిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ పిల్లి ఉదంతం చూసి నెటిజన్లు షాకయిపోతున్నారు. ఇదేం విచిత్రం బాబోయ్ అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఆరు అంతస్తు నుంచి పడిపోయిన ఓ పిల్లి ప్రాణాలతో ఉండటం వారిని ఆశ్చర్యపోతున్నారు. అంత ఎత్తు నుంచి పడ్డా కూడా దానికి పెద్ద గాయాలేమీ కాకపోవడంతో నెటిజన్లకు నోటమాట రావట్లేదు. బ్యాంకాక్‌లో మే 27న జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా(Viral News) మారింది.

అక్కడ ఓ అపార్ట్‌మెంట్‌లోని ఆరు అంతస్తులోని పిల్లి బాల్కనీపై నడుచుకుంటూ కాలు జారి పడిపోయింది. కింద నిలిపి ఉంచిన ఓ కారుపై పడింది. అయితే, కారు వెనుకవైపు ఉన్న అద్దంపై పడటంతో అది కాస్తా పగిలిపోయింది(Cat falls from sixth floor). పెద్ద కన్నం ఏర్పడింది. ఇది చూసిన వారు వెంటనే కారు యజమానికి సమాచారం అందించారు. అంత ఎత్తు నుంచి పడిపోయిన పిల్లి చనిపోయే ఉంటుందని భావించారు. ఈలోపు అక్కడికి వచ్చిన యజమానికి పిల్లి క్షేమంగా కనిపించడంతో ఆశ్చర్యపోయారు.

ఆ తరువాత వెంటనే పిల్లిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా దానికి చిన్న చిన్న గాయాలే అయ్యాయని వైద్యుడు చెప్పాడు. అంతేకాకుండా, పిల్లి ఎటువంటి ప్రాణభయం లేదని భరోసా ఇచ్చాడు. అంత ఎత్తు నుంచి పడ్డా పిల్లికి ఏమీ కాకపోవడం స్థానికంగా పెను సంచలనానికి దారితీసింది.

Updated Date - 2023-06-02T18:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising