ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ యువకుడు ఆమెకు పరిచయస్తుడే.. అందుకే అతడి పన్నాగం పసిగట్టలేకపోయింది.. చివరకు..

ABN, First Publish Date - 2023-03-05T17:48:13+05:30

పరిచయస్తుడు బలవంతం చేయడంతో మొహమాట పడి కారెక్కిన యువతి.. చివరకు జరిగిందో దారుణం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువకుడు ఆమెకు పరిచయస్తుడే. తను ఉండే ప్రాంతంలోనే ఉంటాడు. దీంతో.. ఆ యువతికి అతడిపై ఎటువంటి అనుమానం కలగలేదు. రాత్రి వేళ ఆమెకు దార్లో ఎదురుపడి లిఫ్ట్ ఇస్తానని అతడు అనగానే ఆమె మరో ఆలోచన లేకుండా ఎక్కేసింది. దీంతో.. ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. రాజస్థాన్‌లో(Rajasthan) బయటపడ్డ ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

జైపూర్‌లోని(Jaipur) ముహానా(Muahana) ప్రాంతానికి చెందిన ఓ యువతి(23) స్థానికంగా కూరగాయల వ్యాపారం చేస్తుంటుంది. ఇటీవల ఓరోజు రాత్రి 7.30 గంటల సమయంలో ఆమె ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో నరేశ్ కారులో వచ్చి ఆమె ముందు ఆగాడు. నరేశ్ ఆమెకు పరిచయస్తుడే. ఇక ఆ కారులో నరేశ్‌తో పాటూ అతడి స్నేహితుడు రాహుల్ కూడా ఉన్నారు. తొలుత నరేశ్ యువతిని కారులో ఆమె ఇంటి వద్ద దింపుతానని చెప్పాడు. అయితే.. బాధితురాలు మాత్రం సున్నితంగా తిరస్కరించింది. ఈ క్రమంలో వారిద్దరూ యువతిపై ఒత్తిడి తెచ్చారు. ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని బలవంతం చేశారు. దీంతో.. మొహమాట పడ్డ ఆమె వారి కారులో ఎక్కి కూర్చుంది.

ఈ క్రమంలో నిందితులు యువతిని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు(girl violated after offering lift). విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ యువతిని బెదిరించాక అక్కడి నుంచి పారిపోయారు. చివరకు బాధితురాలు తన ఇంటికి చేరుకుని జరిగిన ఘోరం గురించి కుటుంబసభ్యులకు చెప్పింది. ఆ తరువాత ముహానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - 2023-03-05T17:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising