ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: పెళ్లి తంతు మొదలవుతుండగా వధువు తన ప్రియుడితో పరార్.. ఆ తరువాత వరుడు ఏం చేశాడో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-05-11T21:43:18+05:30

కాసేపట్లో పెళ్లి తంతు మొదలవుతుందనంగా ఓ వధువు తన ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. పెళ్లి కాకుండా సొంతూరుకి వెళితే పరువు పోతుందని మధనపడ్డ పెళ్లికొడుకు, అతడి బంధువులు పెళ్లి కూతురి ఇంట్లోనే ఉండిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కాసేపట్లో పెళ్లి తంతు మొదలవుతుందనంగా ఓ వధువు తన ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. పెళ్లి కాకుండా సొంతూరుకి వెళితే పరువు పోతుందని మధనపడ్డ పెళ్లికొడుకు, అతడి బంధువులు పెళ్లి కూతురి ఇంట్లోనే ఉండిపోయారు. వధువుతో పాటూ మాత్రమే వెళతామంటూ భీష్మించుకు కూర్చున్నారు. రాజస్థాన్‌లోని పాళీ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సిరోహీ జిల్లా మనదార్ గ్రామానికి చెందిన ఓ యువకుడి పెళ్లి పాళి జిల్లా సాయినా గ్రామానికి చెందిన యువతితో కుదిరింది. మే 3న ముహూర్తం ఖరారైంది. పెళ్లి రోజున వరుడు, తల్లిదండ్రులు బంధుమిత్రులతో కలిసి ఊరేగింపుగా కాబోయే అత్తారింటికి వచ్చారు. వధువు తరపు బంధువుల వరుడు, అతడి తరపు వారికి సాదర స్వాగతం పలికారు. సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన క్రతువులన్నీ యథావిధిగా జరిపించారు. ఇక పెళ్లి తంతు ప్రారంభమైన కొద్ది క్షణాలకే వధువు తనకు వాంతి వస్తోందంటూ బాత్రూమ్‌కు వెళ్లింది. ఆ తరువాత ఎంతకీ తిరిగిరాలేదు. అక్కడున్నవారు వెళ్లి చూడగా ఆమె ఆచూకీ ఎక్కడా కనిపించలేదు.

ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన విషయం కొంతసేపటికి ఆమె కుటుంబానికి బోధపడింది. దీంతో వారు వరుడు తరుపు వారికి క్షమాపణలు చెప్పారు. అయితే, వరుడు, అతడి కుటుంబసభ్యులు మాత్రం వధువు ఇల్లు వీడేందుకు నిరాకరించారు. పెళ్లికాకుండా ఇంటికి వెళితే పరువు పోతుందని భావించిన వారు ఆమెను వెంట తీసుకుని మాత్రమే ఇంటికి వెళతామంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఇది జరిగి ఇప్పటికీ ఐదు రోజులు కావస్తున్నా వారు అక్కడి నుంచి కదలలేదు. దీంతో ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరోవైపు వధువు కనిపించట్లేదంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-05-11T21:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising