బెల్టు షాపులపై దాడి.. మద్యం పట్టివేత
ABN, First Publish Date - 2023-10-03T00:02:42+05:30
పోచారం, పొల్కంపల్లిల్లో రాచకొండ క్కైం, ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం వేర్వేరుగా బెల్ట్ షాపుపై దాడులు నిర్వహించి రూ.11,500 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మైబెల్లి తెలిపారు.
ఇబ్రహీంపట్నం, అక్టోబరు 2: పోచారం, పొల్కంపల్లిల్లో రాచకొండ క్కైం, ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం వేర్వేరుగా బెల్ట్ షాపుపై దాడులు నిర్వహించి రూ.11,500 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మైబెల్లి తెలిపారు. పొల్కంపల్లిలో గోగిరెడ్డి నిర్మల కిరాణాషాపులో రూ.8వేల 40లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు.పోచారంలో చింతకుంట్ల లింగమయ్య కిరాణా షాపులో రూ.3,500 విలువైన బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నారు
.యాచారం:అక్రమంగా మద్యం అమ్ముతుండగా సోమవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. యాచారంలో కేశమోని జంగయ్య, గున్‌గల్‌లో పంతంగి మహేష్ ఇళ్లలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని సీఐ సైదయ్య తెలిపారు.
Updated Date - 2023-10-03T00:02:42+05:30 IST