ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Athiya Shetty- KL Rahul: అతియా, కేఎల్. రాహుల్‌ల పెళ్లికి ముహుర్తం ఫిక్స్!

ABN, First Publish Date - 2023-01-12T15:57:36+05:30

సునీల్ శెట్టి కూమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ అతియా శెట్టి (Athiya Shetty). హీరో సినిమాతో వెండితెర పైకి రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సునీల్ శెట్టి కూమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ అతియా శెట్టి (Athiya Shetty). హీరో సినిమాతో వెండితెర పైకి రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇండియన్ క్రికెటర్ కేఎల్. రాహుల్ (KL Rahul) తో అతియా కొంతకాలంగా ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట త్వరలోనే ఏడడుగులు వేయనున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.

అతియా శెట్టి, కేఎల్. రాహుల్‌ల వివాహం జనవరి 23న జరగనుందని తెలుస్తోంది. ఈ పెళ్లి మూడు రోజుల పాటు జరగనున్నట్టు సమాచారం. సునీల్ శెట్టి ఖండలా నివాసంలో ఈ వేడుక జరగనుందట. పెళ్లి సంబరాలు జనవరి 21 నుంచి జనవరి 23 వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికీ హాజరు కానున్నారట. పెళ్లి పనులు ఇప్పటికే మొదలయ్యాయట. అతిథుల లిస్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేశారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, జాకీ ష్రాఫ్, ఎమ్. ఎస్. ధోనీ, విరాట్ కోహ్లీ తదితరులు ఈ పెళ్లిలో సందడి చేయనున్నారు.

Updated Date - 2023-01-12T15:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising