ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తిన్నాక ఓ కునుకు తీయొచ్చు

ABN, First Publish Date - 2023-08-13T12:02:47+05:30

రెస్టారెంట్‌కి వెళ్లి, నచ్చివన్నీ లాంగిచేశాక భుక్తాయాసంతో ‘అబ్బా... కాసేపు ఇక్కడే ఓ కునుకేస్తే బాగుణ్ణు’ అని అనిపించనివారు ఉండరేమో.

రెస్టారెంట్‌కి వెళ్లి, నచ్చివన్నీ లాంగిచేశాక భుక్తాయాసంతో ‘అబ్బా... కాసేపు ఇక్కడే ఓ కునుకేస్తే బాగుణ్ణు’ అని అనిపించనివారు ఉండరేమో. అలాంటి కస్టమర్లను దృష్టిలో పెట్టుకునే తిన్న తర్వాత ఎంచక్కా అక్కడే ప్రఽశాంతంగా కాసేపు నిద్రపోయే వెసులుబాటు కల్పించింది ఓ రెస్టారెంట్‌. ఇంతకీ అలాంటి ‘రెస్ట్‌’రెంట్‌ ఎక్కడుందంటారా?

ఫుల్‌గా తిన్నాక కాసేపు అలాగే వెనక్కి చేరగిలబడితే ఎంత హాయిగా ఉంటుందో! ఇంట్లో అయితే పర్వాలేదు గానీ, మరి రెస్టారెంట్‌కి వెళ్తే పరిస్థితేంటి? కొన్నిసార్లు మాగన్నుగా తన్నుకొస్తున్న నిద్రను ఎంతో కష్టంపై ఆపుకుని, ఇంటికి రాగానే బెడ్‌పై అలాగే వాలిపోతుంటాం. అయితే ‘ఇక నుంచి ఓ లెక్క... ఇప్పుడో లెక్క’ అంటోంది మయూబ్‌ రెస్టారెంట్‌.

డైనింగ్‌ హాల్‌ పక్కనే పడకలు...

జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌లో ఈ తమాషా ‘రెస్ట్‌’రెంట్‌ ఉంది. ‘మా దగ్గరకు వచ్చి.. కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయి, లేచాకే ఇంటికి వెళ్లండి’ అంటున్నారు సదరు క్రేజీ రెస్టారెంట్‌ యజమాని. తిన్న వెంటనే అక్కడే ఓ రెండడుగులు వేస్తే చాలు.. అలా పడకపై వాలిపోయే వీలుగా డైనింగ్‌ హాల్‌ పక్కనే ప్రత్యేకంగా కొన్ని బెడ్లు, ఏసీ ఏర్పాటు చేశారు. అయితే ఈ బంపర్‌ ఆఫర్‌ రెస్టారెంట్‌కి వచ్చే అందరికీ కాదండోయ్‌... అక్కడి స్పెషల్‌ డిష్‌, జోర్డాన్‌ జాతీయ వంటకమైన ‘మన్సాఫ్‌’ తిన్నవారికి మాత్రమే.


ఇది తింటే నిద్ర తప్పనిసరి...

భోజనప్రియులు అమితంగా ఇష్టపడే ‘మన్సాఫ్‌’ చాలా హెవీ ఫుడ్‌. ఒక రకంగా మన బిర్యానీ లాంటిదన్నమాట. స్వచ్ఛమైన నెయ్యి, గొర్రె మాంసం, పుల్లటి పెరుగు, అన్నంతో ప్రత్యేకంగా తయారు చేసిన సాంప్రదాయక వంటకం ఇది. ఇందులో వాడే ఆహార పదార్థాలలో అధిక కొవ్వు శాతం ఉంటుంది. కడుపు నిండిపోతుంది. మత్తుగా, మగతగా అనిపిస్తుంది. ఆవులింతలు మొదలవుతాయి. దాంతో మన్సాఫ్‌ తిన్నాక ఎంతటి వారైనా నిద్రలోకి జారుకోక తప్పదు. అలా జరగలేదంటే.. ఆ డిష్‌లో ఏదో లోపముందని అర్థమట. రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లు అలా సేద తీరుతున్న సమయంలో వారి చెంతకే వెళ్లి సంప్రదాయ జోర్డాన్‌ కాఫీని కూడా సర్వ్‌ చేస్తారు. రెస్టారెంట్‌కి వచ్చిన కొందరు కస్టమర్లు ‘తిన్న తర్వాత నిద్ర ముంచుకొస్తోంది. ఇక్కడ మీరు ఎందుకు పడకలు ఏర్పాటు చేయకూడద’ని యజమానికి సలహా ఇచ్చారట. మొదట యజమాని వారి మాటలను జోక్‌గా తీసుకున్నా... తర్వాత సీరియస్‌గా ఆలోచించాడు. ఆచరణలో పెట్టాడు. కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ ఈరోజు మయూబ్‌ రెస్టారెంట్‌ను ప్రత్యేకంగా నిలిపింది. మన దగ్గర కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తే భలేగా ఉంటుంది కదూ!

Updated Date - 2023-08-13T12:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising