ఆకట్టుకున్న పిల్లుల ప్రదర్శన
ABN, First Publish Date - 2023-01-31T10:44:51+05:30
సేలంలో నిర్వహించిన పెంపుడు పిల్లుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. హూరైరా ఫ్యాన్సియస్, గేట్ క్లబ్ ఆఫ్ ఇండియా సంయుక్తం
పెరంబూర్(చెన్నై), జనవరి 30: సేలంలో నిర్వహించిన పెంపుడు పిల్లుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. హూరైరా ఫ్యాన్సియస్, గేట్ క్లబ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఈ ప్రదర్శనలో తమిళనాడు, కేరళ, కర్ణాటక(Tamil Nadu, Kerala, Karnataka) సహా పలు రాష్ట్రాల నుంచి ‘బెంగాల్ టైగర్’, ‘పెర్సియస్ లాంగ్ హెయిర్’, ‘ఎక్స్మోటిక్ వెరైటీ, సియామిస్, నైజీరియన్ సహా 20జాతులకు చెందిన 200 పెం పుడు పిల్లులను వాటి యజమానులు తీసుకొచ్చారు. పిల్లి జాతి, సంరక్షణ, ఆరోగ్యం సహా పలు పరీక్షలునిర్వహించారు. మొదటి మూడు స్థానాలు పొందిన పిల్లులకు రూ.10 వేలు విలువైన పౌష్టికాహారం, సర్టిఫికెట్, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రదర్శ న నిర్వాహకులు మహమ్మద్ రబ్బాని మాట్లాడుతూ, ఈ ప్రదర్శనలో రూ.5 వేల నుంచి రూ.5లక్షల విలువైన 200 పిల్లులు పాల్గొన్నాయని, పిల్లులు పెంచుకోవాలనుకొనే వారు ఈ ప్రదర్శనలో పాల్గొని పిల్లుల సంరక్షణ, ఆ హారం తదితరాల గురించి పిల్లుల యజమానులను అడిగి తెలుసుకున్నారని తెలిపారు.
Updated Date - 2023-01-31T10:44:52+05:30 IST