ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమార్తె ఆ యువకునితో మాట్లాడుతోందని గమనించిన తల్లి.. ఆమెను హెచ్చరించింది... ఇంతలో ఊహించని విధంగా ఏం జరిగిందంటే...

ABN, First Publish Date - 2023-02-21T11:12:25+05:30

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల యువతిని నలుగురు యువకులు 4 అంతస్థుల అపార్ట్‌మెంట్ టెర్రస్ నుండి కిందకు తోసేశారు. ఈ ఘటనలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల యువతిని నలుగురు యువకులు 4 అంతస్థుల అపార్ట్‌మెంట్ టెర్రస్ నుండి కిందకు తోసేశారు. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు సహా నలుగురు అనుమానిత యువకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుల్లో ఒక యువకుడు గతంలో మృతురాలితో మాట్లాడేవాడు.

ఇది ఆమె తల్లికి ఇష్టం లేకపోవడంతో అతనితో మాట్లాడొద్దని హెచ్చరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజధాని రాంచీకి 170 కి.మీ దూరంలోని బార్వాడా పోలీస్ స్టేషన్‌లోని భేలతాండ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ కేసును పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమర్ కుమార్ పాండే మాట్లాడుతూ.. 'ఇద్దరు యువకులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నాం. మృతురాలు ధన్‌బాద్‌లోని కాన్వెంట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. తన కుమార్తె ఆమెకు సీనియర్‌ అయిన అపార్ట్‌మెంట్‌లోని ఓ అబ్బాయి తరచూ మాట్లాడేదని బాధితురాలి తల్లి పోలీసులకు తెలిపింది.

ఈ విషయమై ఆమె తన కూతురిని తిట్టడంతోపాటు ఆ యువకునితో మాట్లాడవద్దని హెచ్చరించింది. అయితే తాజాగా అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో తన స్నేహితుడితో కలిసి ఆ యువకుడు కనిపించాడని బాధితురాలి తల్లి పోలీసులకు తెలిపింది. బాధితురాలి కుటుంబం భవనంలోని మొదటి అంతస్తులో ఉంటోంది. ఎవరో ఆ యువతిని నాలుగు అంతస్థుల అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై నుంచి తోసేశారని పోలీసులు తెలిపారు. టెర్రస్‌పై నుంచి తోసేసిన కుర్చీ కూడా కనిపించిందని పోలీసులు తెలిపారు. కుర్చీని అక్కడికి ఎవరు తీసుకొచ్చారు, టెర్రస్‌పై ఎంత మంది ఉన్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలిముద్రలు కూడా తీసుకుంటున్నామని డీఎస్పీ తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ ముఖర్జీ మాట్లాడుతూ ఈ ఘటనపై తమ కమిటీ దృష్టి సారించిందని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత దీనిపై వ్యాఖ్యానిస్తామన్నారు.

Updated Date - 2023-02-21T11:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising