ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాఘ మేళా అంటే ఏమిటి? ఇందులో ఒక నెల పాటు జరిగే కల్పవాసం ప్రాముఖ్యత ఇదే...

ABN, First Publish Date - 2023-01-03T07:27:32+05:30

యూపీలోని సంగమనగరం ప్రయాగ్‌రాజ్‌లో 6 జనవరి 2023 నుండి మాఘమేళా ప్రారంభం కానుంది. ఈ మాఘ మేళా ప్రతి సంవత్సరం పుష్య పూర్ణిమ నుండి ప్రారంభమవుతుంది. ఇది మాఘ పూర్ణిమతో ముగుస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూపీలోని సంగమనగరం ప్రయాగ్‌రాజ్‌లో 6 జనవరి 2023 నుండి మాఘమేళా ప్రారంభం కానుంది. ఈ మాఘ మేళా ప్రతి సంవత్సరం పుష్య పూర్ణిమ నుండి ప్రారంభమవుతుంది. ఇది మాఘ పూర్ణిమతో ముగుస్తుంది. ఇందులో గంగ, యమున, సరస్వతి సంగమ ఒడ్డున నెల రోజులపాటు కల్పవాసం చేస్తారు. మాఘ మేళా తీర్థయాత్రలో చేసే స్నానం, దానం, తపస్సు ఎంతో ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎవరైనా తీర్థయాత్ర లేదా పుణ్యక్షేత్రాలలో స్నానం చేయలేకపోతే, వారు తన ఇంటి వద్దనే గంగాజలంతో స్నానం చేయవచ్చని చెబుతారు. మాఘమాసంలోని కల్పవాసం ప్రాముఖ్యత, నియమాలను తెలుసుకుందాం.

మాఘ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఉత్తరాదిన మాఘ మాసం 7 జనవరి 2023 శనివారం నుండి ప్రారంభమవుతుంది. 5 ఫిబ్రవరి 2023 మాఘి పూర్ణిమ నాడు ముగుస్తుంది. పురాణాల ప్రకారం, మాఘ మాసానికి శ్రీ కృష్ణుని రూపమైన "మాధ్" అంటే "మాధవ్"తో గాఢమైన సంబంధం ఉంది. మాఘమాసంలో కల్పవాసం, కృష్ణ పూజలకు విశేష ప్రాధాన్యత ఉంది.

కల్పవాసం అంటే..

గంగా, యమున, సరస్వతి పవిత్ర నదుల ఒడ్డున మాఘమేళా సందర్భంగా చేసే తపస్సు, పాటించే మౌనానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కల్పవాసం అంటే సంగమం ఒడ్డున నిర్దిష్ట కాలం ఉండి సత్సంగం చేయడం, నదీస్నానం, స్వీయ అధ్యయనం చేయడం. పూర్వకాలం నుంచి ఋషులు, గృహస్థులు ప్రతినెలా కల్పవాపం చేసే సంప్రదాయం వస్తోంది.

మాఘ మేళాలో కల్పవాసం ప్రాముఖ్యత

క్రమం తప్పకుండా కల్పవాసం చేసే వ్యక్తి జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారాలను కనుగొనగలడని చెబుతారు. కల్పవాసం ద్వారా సాధకుడు మనస్సు, ఇంద్రియాలను నియంత్రించే శక్తిని పొందుతాడు. ఈ వ్రతం మనిషికి గల అన్ని ప్రాపంచిక ఉద్రిక్తతలను తొలగిస్తుంది. మరణానంతరం మోక్షాన్ని పొందుతాడని చెబుతారు.

Updated Date - 2023-01-03T07:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising