Indian Origin CEOs: అమెరికన్ టాప్ కంపెనీలన్నీ భారతీయులకే ఎందుకు పగ్గాలిస్తున్నాయంటే..
ABN, First Publish Date - 2023-02-21T21:51:53+05:30
అమెరికా టెక్ రంగంలో మనోళ్లదే హవా..కారణం ఇదే..
ఎన్నారై డెస్క్: అమెరికా టెక్ రంగంలో(Tech sector) మనోళ్లదే హవా! గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబీ సీఈఓ శంతను నారాయణ్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ..ఇలా పలువురు భారతీయులు అమెరికా టెక్ కంపెనీలను ముందుండి(Indian Origin CEOs) నడిపిస్తున్నారు. అమెరికా టెక్ రంగంలో భారతీయులు ఎందుకింత పురోగతి సాధించారూ అంటే.. పలు కారణాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
ప్రస్తుతం టెక్ కంపెనీలకు నేతృత్వం వహిస్తున్న భారతీయుల్లో అధికశాతం మంది ఇంజినీర్లే. దీంతో.. అటు మేనేజ్‌మెంట్ మెళకువలు, ఇటు సాంకేతిక నైపుణ్యాలు కలగలిసి భారతీయులు కార్పొరేట్ రంగంలో దూసుకెళుతున్నారు.
కిందిస్థాయి ఉద్యోగుల్లో ఒకరిగా కలిసిపోతూనే వారికి దిశానిర్దేశం చేసేవారే నిజమైన నాయకులు. ఈ స్వభావం భారతీయ నాయకుల్లో పుష్కలంగా ఉందని పరిశీలకులు చెబుతారు.
భారతీయ సీఈఓల్లో పని పట్ల ప్యాషన్, నిబద్ధత ఎక్కువని చెబుతారు. కొన్ని దశాబ్దాల పాటు వీరు తమ తమ రంగాల్లో విశేష కృషి చేశారు.
ఇక కంపెనీల్లో అనవసర ఖర్చులు తగ్గించి సంస్థలను లాభాల బాట పట్టించడంలో మనోళ్లది అందెవేసిన చేయి అని పరిశీలకుల అభిప్రాయం. కంపెనీల పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే వారు సమూల మార్పులు తీసుకొస్తారట. తద్వారా..కంపెనీల లాభాలను పెంచి అదనపు విలువ జోడిస్తారట.
Updated Date - 2023-02-21T21:54:38+05:30 IST