ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: తెలుగు కళా సమితి (TKS) కువైట్ నూతన కార్యవర్గం ఎన్నిక

ABN, First Publish Date - 2023-05-30T17:06:00+05:30

ఎన్నికల సంఘం సభ్యులు రెడ్డి ప్రసాద్, సీతారామ రావు, నెట్టెం ప్రసాద్, డి. కిరణ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగ్గా, మే12 న ఎన్నికల ఫలితాలను వెలువడ్డాయి. ఏకగ్రీవ ఎన్నిక ద్వారా తెలుగు కళా సమితి నూతన కార్యవర్గ కమిటీ 2023-2024 ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముప్ఫై నాలుగు సంవత్సరాలు ఘనమైన చరిత్ర కలిగినటువంటి తెలుగు కళా సమితి (TKS) కువైట్ ఎటువంటి లాభాపేక్ష లేని సామాజిక-సాంస్కృతిక సంస్థ. తెలుగు కళా సమితి (TKS) కువైట్‌లో తెలుగు వారందరినీ ఏకం చేయడం, తెలుగు సంప్రదాయం, సంస్కృతి, కళలను పరిరక్షించడమే ధ్యేయంగా పని చేస్తూ ఎన్నో సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు కళా సమితిని కువైట్లో నివసిస్తున్న తెలుగు వారందరికీ చేరువుగా చేసింది.

ఎన్నికల సంఘం సభ్యులు రెడ్డి ప్రసాద్, సీతారామ రావు, నెట్టెం ప్రసాద్, డి. కిరణ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగ్గా, మే12 న ఎన్నికల ఫలితాలను వెలువడ్డాయి. ఏకగ్రీవ ఎన్నిక ద్వారా తెలుగు కళా సమితి నూతన కార్యవర్గ కమిటీ 2023-2024 ఏర్పడింది. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీ (2021-23) మే26 న కార్మెల్ పాఠశాలలో నిర్వహించిన వార్షిక మెగాఈవెంట్ “స రి గ మ ప” సందర్భంగా, అప్పగింత ప్రక్రియను నిర్వహించింది.

కార్యనిర్వాహక కమిటీ:

  • అధ్యక్షులు: పొత్తూరు పార్థ సారథి

  • ఉపాధ్యక్షులు: దొమ్మరాజు కృష్ణమ రాజు

  • ప్రధాన కార్యదర్శి: ముద్దా సుబ్బారావు

  • సంయుక్త కార్యదర్శి: శ్రీనివాస్ గుణ్ణం

  • కోశాధికారి: అశ్వని కుమార్ నిమ్మగడ్డ

కార్యవర్గ సభ్యులు:

  • దుర్గా ప్రసాద్ గుత్తుల (అబుహలీఫా)

  • సౌజన్య కునాల (అబుహలీఫా)

  • దుర్గా వెంకటనాగఅప్పల గుల్లుపూడి (అబ్బాసియా/హవల్లి)

  • ఫణీంద్ర సానబోయిన (ఫహాహీల్/మంగఫ్/అహ్మదీ)

  • నవీన్ కుమార్ మదినేని (ఫర్వానియా/రెగ్గై/కువైట్ సిటీ)

  • నాగార్జున రెడ్డి కందుల (సాల్మియా)

సాయి సుబ్బారావు నేతృత్వంలోని ప్రస్తుత కమిటీ (2021-23) అవిశ్రాంత ప్రయత్నాలను నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన అభ్యర్థి పొత్తూరు పార్థ సారథి ప్రశంసించారు. కరోనా మహమ్మారి పరిస్థితుల్లో కూడా మన తెలుగు కళా సమితి చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసిస్తూ కమిటి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

పొత్తూరు పార్థ సారథి మాట్లాడుతూ నూతన కమిటీ తెలుగు సంస్కృతి, విలువలను నిలబెట్టే దిశగా సంస్థను నడిపిస్తానని హామీ ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన కమిటీ మరిన్ని వినూత్నమైన సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని హామీ ఇచ్చారు. గత కమిటీల వారసత్వాన్ని కొనసాగిస్తూ మరింత ఉత్సాహంతో ఈ కమిటీ పనిచేస్తుందని పొత్తూరు పార్థ సారథి చెప్పారు. ఉపాధ్యక్షులు కృష్ణమ రాజు మాట్లాడుతూ నూతన కమిటీ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కోశాధికారి అశ్వని కుమార్ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన కమిటి చేయబోయే కార్యక్రమాలన్నిటినీ జయప్రదం చేయాలనీ అలాగే వాటికి కావాల్సిన సహాయ సహకారాలని అందించాలని కోరారు. తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, కళలను అభివృద్ధి చేయడం, పరిరక్షించడం తెలుగు కళా సమితి (TKS) కువైట్ లక్ష్యంగా కమిటీ పేర్కొంది. తెలుగు కళా సమితి (TKS) కువైట్ భారత రాయబార కార్యాలయంలో నమోదైన అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉండటం తమకు గర్వకారమని వ్యాఖ్యానించింది.

Updated Date - 2023-05-30T17:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising