ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: రియాధ్‌లో నూతన తెలుగు ప్రవాసీ సంఘం టాసా అవిర్భావం

ABN, First Publish Date - 2023-10-07T15:22:44+05:30

సౌదీ అరేబియాలోని తెలుగు ఎన్నారైలు రియాద్ కేంద్రంగా నూతన తెలుగు సంఘం టాసాను ఏర్పాటు చేసుకున్నారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఒకప్పుడు తెలుగు సంస్కృతి అంటే ఎండమావులయిన ఎడారులలో ఇప్పుడు తెలుగుతనం ఉట్టిపడుతుంది. అరబ్బు దేశాలన్నింటిలోనూ అతి పెద్ద, కీలక దేశమైన సౌదీ అరేబియాలో విజన్ 2030 సరళీకృత విధానాలకు తోడుగా శరవేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి తోడుగా ఉపాధి కొరకు పెద్ద సంఖ్యలో వస్తున్న తెలుగు యువత తమ మూలాలు మరియు సంస్కృతి పరిరక్షణకై ప్రాధాన్యత ఇస్తోంది.

ఈ క్రమంలో రియాధ్ నగరం కేంద్రంగా ప్రవాసీ ప్రముఖుడు రెవల్ అంథోని నేతృత్వంలో నూతనంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌదీ అరేబియా (టాసా) అనే ప్రవాసీ సంఘం అవిర్భవించింది. స్ధానిక చట్టాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ తెలుగు సంస్కృతి ప్రొత్సహాంతో పాటు కష్టాలలో ఉన్న తోటి తెలుగు ప్రవాసీలకు ఇక్కడి చట్టాలకు లోబడి సహాయం చేసే దిశగా తాము కృషి చేస్తామని అంథోని అన్నారు.


ప్రవాస బాటన అందరి విఘ్నాలను తొలగించాలంటూ విఘ్నేశ్వరుడ్ని మోక్కుతూ నూతన సంఘానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ‘రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం’ పేరిట చాల కాలంగా రాజధాని నగరంలోని తెలుగు కుటుంబాల తలలో నాలుకగా ఉన్న ఈ సంఘం ఇక నుండి టాసాగా నూతన అవతారమెత్తి రియాధ్ నగరం బయట కూడా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న తెలుగు ప్రవాసీయులను చెరువ కావడానికి ప్రయత్నిస్తుంది.

వివిధ సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుక్కుగా ఉండే స్వర్ణ స్వామి అధ్వర్యంలో ఈ సంఘం పని చేస్తుంది. సౌదీలోని ప్రవాసీ తెలుగు సమాజంలో నూతన జవసత్వాలు సమకూర్చడమే లక్ష్యంగా తమ సంస్థ ముందుకు వెళ్తుందని స్వామి పెర్కోన్నారు.

మధు బొల్లెపల్లి, అనిల్ మర్రి, మురారి, నటరాజ్ కుమార్, భాస్కర్ గంధవళ్ళీ, మహేంద్ర వాకటి, నరేష్, ప్రసాద్, శ్రీకాంత్, ఇబ్రహీం, రవి , ఇందుకూరి సీతరామరాజు, అద్దంకి కిషోర్, అనివళ్ళ మనోహార్ తదితరులు వివిధ కమిటీలకు నేతృత్వం వహిస్తారని స్వామి వెల్లడించారు. సంఘం గూర్చి మరిన్ని వివరాల కొరకు 0564994408 ఫోన్ నెంబర్ పై స్వామిను సంప్రదించవచ్చు.

Updated Date - 2023-10-07T15:34:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising