ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: రియాధ్‌లో తెలుగు కుటుంబ సమ్మేళనం ఆధ్వర్యంలో ఇఫ్తార్, క్రికెట్ ట్రోఫీల ప్రదానం

ABN, First Publish Date - 2023-04-18T09:44:13+05:30

రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీ సంఘమైన రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం ఇటీవల ఇఫ్తార్ పార్టీను నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీ సంఘమైన రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం ఇటీవల ఇఫ్తార్ పార్టీను నిర్వహించింది. ఈ సందర్భంగా క్రికెట్ పోటీలలో విజయం సాధించిన ఉగాది మరియు రంజాన్ ప్రీమియర్ లీగ్ జట్ల సభ్యులను అభినందించారు.

స్థానిక ఒక రెస్టారెంట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడల ప్రాముఖ్యతను తెలుగు కళా క్షేత్రం అధ్యక్షులు అంటోని ఎబల్, తెలుగు కుటుంబ సమ్మేళన అధ్యక్షులు స్వామి స్వర్ణ తిరుపతిలు వివరించారు. గత ఆరు సంవత్సరాలుగా తమ సంఘం కార్యక్రమాలు చేపడుతుందని స్వామి వివరించారు.

ఈ కార్యక్రమానికి రియాధ్ నగరంలోని వివిధ రాష్ట్రాల ప్రముఖులు, అఖిల భారతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గోనగా వారందరికి, శాలువాలు కప్పి సన్మానం చేసారు. భారతీయ ప్రముఖులు షీహాబ్ కోత్తుకాడ్, సతీష్ దీపక్, అహ్మద్ ఇంతియాజ్, అబ్దుల్ జబ్బార్, సంతోష్ శెట్టి, మోహీయోద్దీన్ సలీంలతో పాటు అంథోనీకి శాలువలు కప్పి సన్మానం చేసారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన తెలుగు కళా క్షేత్రం అధ్యక్షులు అంటోని, సమ్మేళన ప్రతినిధులు అనిల్ మర్రి, శ్రీకాంత్ దండే, సంజయ్‌లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేసారు.

ఒక్క రంజాన్ ఇఫ్తార్‌యే కాకుండా దీపావళీ, కృష్ణాష్టమి ఇతర పండుగలను జరుపుకోడానికి సహకరిస్తున్న భాస్కర్ గంధవల్లి, నటరాజ్, ఆర్. వి.పి. ప్రసాద్, మహేంద్ర వాకాటి, మురారి, నరేష్ చెన్నుపాటి, ఇబ్రహీం, నాగేంద్ర, విజయ్ గొల్ల, సిద్దిఖ్, శ్రీనివాస్, ప్రశాంత్, కరుణ్, ప్రసాద్ అన్న, ప్రవీణ్ పోకిరి, సుఖేష్ తదితరులకు ప్రత్యేకంగా అభినందలను తెలియజేసినట్లుగా స్వామి తెలిపారు.

Updated Date - 2023-04-18T09:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising