ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: శశికాంత్‌ వల్లేపల్లి ఉదారత...700 మందికి వైద్యసేవలు

ABN, First Publish Date - 2023-10-01T19:49:17+05:30

హైదరాబాద్‌లో తానా, సీసీసీ, స్వేచ్ఛ సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో 700 మందికిపై ఉచితంగా వైద్యసేవలందించారు. ఈ వైద్యశిబిరానికి వల్లేపల్లి శశికాంత్‌, భార్య ప్రియాంక వల్లేపల్లి స్పాన్సర్లుగా వ్యవహరించారు.

ఎన్నారై డెస్క్: హైదరాబాద్‌లో తానా, సీసీసీ, స్వేచ్ఛ సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో 700 మందికిపైగా ఉచితంగా వైద్యసేవలందించారు. ఈ వైద్యశిబిరానికి వల్లేపల్లి శశికాంత్‌, భార్య ప్రియాంక వల్లేపల్లి స్పాన్సర్లుగా వ్యవహరించారు. మెగా వైద్యశిబిరాలకు వస్తున్న స్పందన, స్వేచ్ఛ వాలంటీర్లు అందిస్తున్న సేవలు చూసి శశికాంత్‌ వల్లేపల్లి అందరికీ అభినందనలు తెలియజేశారు.

ఈ క్యాంప్‌‌కు గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లోని స్లమ్స్‌ నుంచి దాదాపు 7 వందలమంది హాజరయ్యారు. వీరికి 13 మంది వైద్యులు కన్సల్టెన్సీ సేవలు అందించారు. హాజరైన పేషెంట్లు అందరికీ ఫ్రూట్స్‌, పులిహోర పంపిణీ చేశారు. స్వేచ్ఛ తరపున సాఫ్ట్‌‌వేర్‌ ఇంజనీర్లు, బీటెక్‌ విద్యార్థులు, బ్యాంక్‌ ఉద్యోగులు ఇతర మేధావులు వాలంటీర్లుగా హాజరై సేవలు అందించారు. సీసీసీ ప్రెసిడెంట్‌ చక్రధర్‌ మొత్తం క్యాంప్‌‌ను పరిశీలించి, స్వేచ్ఛ వారిని అభినందించారు. తాము కూడా ఇందులో భాగస్వాములైనందుకు గర్వపడుతున్నామని అన్నారు.

ఈ మెడికల్‌ క్యాంప్‌ కోసం 26 మంది వైద్యుల బృందం పని చేస్తుంది. వీరంతా రొటేషన్‌ పద్ధతిలో హాజరవుతుంటారని తెలిపారు. ఆర్థోపెడిక్‌, డయాబెటీక్‌, గైనకాలజీ, పీడీయాట్రిషన్‌ ఇంకా ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు కన్సల్టెన్సీ సేవలు అందించారు. పేషెంట్లు అందరికీ నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు. ఈ క్యాంప్‌‌లో రెగ్యులర్‌‌గా కళ్లకు సంబంధించిన స్పెషలిస్ట్‌ సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 140 మంది పేషెంట్లకు కాటరాక్ట్‌ ఆపరేషన్లు ఉచితంగా చేయించారు. వందలాదిమందికి ఉచితంగా కళ్లజోళ్లు అందించారు. విజయవంతంగా ఈ వైద్యశిబిరాన్ని నిర్వహించిన అందరినీ తానా నాయకులు నిరంజన్‌ శృంగవరపు, అంజయ్య చౌదరి లావు, వెంకటరమణ యార్లగడ్డ అభినందించారు.

Updated Date - 2023-10-01T19:51:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising