NRI: భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని ఎన్నారైకి అనుమానం.. ఇండియాకు వచ్చిన మూడో రోజున..
ABN, First Publish Date - 2023-08-12T16:52:27+05:30
భార్య అక్రమసంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ కేరళ ఎన్నారై ఇటీవల ఇండియాకు వచ్చిన మూడో రోజునే దారుణంగా కొట్టి చంపేశాడు. ఆ తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఎన్నారై డెస్క్: తన భార్య అక్రమసంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ ఎన్నారై ఇండియాకు వచ్చిన మూడో రోజున దారుణానికి ఒడిగట్టాడు. శుక్రవారం ఆమెను చావబాది హత్య చేశాడు(NRI accuses wife of cheating, kills her). అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే..కేరళలోని(Kerala) వియ్యూర్‌కు చెందిన ఎన్నారై ఉన్నికృష్ణన్(56) కొన్నేళ్లుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలం క్రితం అతడికి తన భార్య(46) అక్రమసంబంధం పెట్టుకుందన్న అనుమానం మొదలైంది. కాగా, ఆగస్టు 8న ఇండియాకు ఆయన ఇండియాకు వచ్చాడు. అయితే, భార్యపై అనుమానంతో రగిలిపోతున్న ఆయన శుక్రవారం భార్యను కడతేర్చాడు. ఆ తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యను తానే చంపానని అంగీకరించాడు.
Updated Date - 2023-08-12T16:54:46+05:30 IST