NRI: సెక్స్ వర్కర్‌పై దాడి.. అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్..
ABN, First Publish Date - 2023-04-16T12:25:26+05:30
సెక్స్ వర్కర్‌పై దాడి.. అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్..
ఎన్నారై డెస్క్: అమెరికాలో సెక్స్ వర్కర్‌పై దాడి చేసిన ఓ భారతీయ సంతతి యువకుడిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 9న న్యూ జెర్సీలోని ఓ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లి వెళితే.. వినీత్ రావూరి అనే యువకుడు, ఓ సెక్స్ వర్కర్‌ను హోటల్‌లో కలుసుకుందామనుకున్నాడు. హోటల్ గదిలోకి వెళ్లాఆ మహిళ వినీత్‌ను తిరస్కరించింది. గదిలోంచి వెళ్లిపోవాలని సూచించింది. దీంతో.. కోపోద్రిక్తుడైన వినీత్ తన డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ ఆమెను కత్తితో బెదిరించాడు. కానీ.. మహిళ మాత్రం డబ్బు తిరిగిచ్చేందుకు తిరస్కరించడంతో వినీత్ ఆమెపై దాడి చేశాడు.
ఈ క్రమంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ తరువాత అతడి నుంచి తప్పించుకున్న యువతి హోటల్ లాబీలోకి వెళ్లి పోలీసులకు ఫోన్ చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆయుధాలతో దోపిడీకి దిగడం, తీవ్ర స్థాయిలో దాడి చేయడం, అనుమతి లేకుండా ఆయుధం కలిగి ఉండటం, ప్రాస్టిట్యూషన్ తదితర సెక్షన్ల కింద అతడిపై పోలీసుల కేసు నమోదు చేశారు.
Updated Date - 2023-04-16T12:25:26+05:30 IST