ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: విమాన ప్రమాదంలో భారత సంతతి బిలియనీర్ దుర్మరణం

ABN, First Publish Date - 2023-10-02T22:19:07+05:30

జింబాబ్వేలో ఇటీవల జరిగిన ఓ విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హర్‌పాల్ రణ్‌ధావా ఆయన కుమారుడు అమర్ దుర్మరణం చెందారు.

ఎన్నారై డెస్క్: జింబాబ్వేలో ఇటీవల జరిగిన ఓ విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హర్‌పాల్ రణ్‌ధావా ఆయన కుమారుడు అమర్ (23) దుర్మరణం చెందారు. తన సంస్థ రియోజిమ్‌కు చెందిన ప్రైవేటు విమానంలో హారారే నుంచి మురోవా వజ్రాల గనికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం కూలిపోయింది. సెప్టెంబర్ 29న జరిగిన ఈ ధుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు.

మైనింగ్ రంగంలో విస్తృత అనుభవం ఉన్న హర్‌పాల్ రణ్‌దావా ఆఫ్రికాలో ప్రముఖ మైనింగ్ కంపెనీ రియోజిమ్‌ను నెలకొల్పారు. ఈ సంస్థకు బంగారం బొగ్గు గనులు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ సంస్థ నికెల్, కాపర్ వంటి ఖనిజాల శుద్ధీకరణ కూడా చేపడుతోంది. కాగా, మైనింగ్‌తో పాటు రణ్‌దావా ప్రైవేటు ఈక్విటీ వ్యాపారంలోకి కూడా ప్రవేశించారు. జీఈఎమ్ పేరిట ఓ సంస్థను నెలకొల్పారు.

కాగా, రణ్‌దావా మృతి గురించి ఆయన స్నేహితుడు, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ హోప్‌వెల్ చినూఓ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆయన మృతిపై సంతాపం తెలిపారు. మిలియనీర్ అయినప్పటికీ రణ్‌దావా వినయశీలి అని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. జింబాబ్వేపై రణ్‌దావా చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.

Updated Date - 2023-10-02T22:19:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising