ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: ఈ డాక్టర్‌ కష్టం ఏ భర్తకూ రాకూడదు.. ప్రసవం తరువాత కళ్లముందే భార్య మరణం

ABN, First Publish Date - 2023-09-29T22:52:19+05:30

న్యూయార్క్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. భార్య మరణాన్ని ఓ వైద్యుడు ప్రత్యేక్షంగా వీక్షించిన విషాదకర ఘటన బఫెలో నగరంలో వెలుగులోకి వచ్చింది.

ఎన్నారై డెస్క్: న్యూయార్క్ రాష్ట్రంలో (Newyork state) విషాదం చోటుచేసుకుంది. భార్య మరణాన్ని ఓ వైద్యుడు ప్రత్యేక్షంగా వీక్షించిన విషాదకర ఘటన బఫెలో నగరంలో వెలుగులోకి వచ్చింది. బిడ్డను ప్రసవించిన కొన్ని రోజులకే మహిళ తన భర్త కళ్లముందే కన్నుమూసింది. ఆమె మరణించిన సమయాన్ని వైద్యుడైన భర్త స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది.


జేరెడ్ విల్సన్ బఫెలో(Buffalo) నగరంలోని బఫెలో మెడికల్ సెంటర్‌లో రెసిడెంట్ అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. గతేడాది ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డెలివరీ సమయంలో తలెత్తిన సమస్య కారణంగా ఆయన భార్య ప్రసవం అయిన కొన్ని రోజులకే మరణించింది. గతేడాది డిసెంబర్ 12న ఆమెకు డెలివరీ డేట్ కావడంతో ఆసుపత్రిలో వైద్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ, అకస్మాత్తుగా ఆమె కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. దీంతో, తల్లిబిడ్డల ప్రాణాలు రక్షించేందుకు వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారు.


బిడ్డ ఆరోగ్యంగా పుట్టడంతో సంతోషించిన తల్లికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆపరేషన్ జరిగిన కొద్ది సేపటి నుంచీ ఆమె అనారోగ్యం బారిన పడింది. ఆ తరువాత పది రోజుల పాటు ఆమెకు వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. మహిళ ఊపిరితిత్తులు బలహీనపడటంతో ఇన్‌ట్యూబేట్ చేశారు. ఆపై వెంటిలేటర్ కూడా అమర్చారు. కానీ, ఆశించిన ఫలితంలేకపోవడంతో మహిళ ఊపిరాడక అవస్థ పడింది. చివరకు రక్తపోటు పెరిగిపోయింది.

ఈలోపు, మహిళ కాళ్లల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడి అవి గుండెకు చేరాయి. మరోవైపు మహిళ సెప్టిక్ షాక్ బారిన కూడా పడింది. ఆమెను కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నమే చేశారు. ఆమెకు మరణం తప్పదని గుర్తించిన భర్త నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను తిరిగి స్పృహలోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నా వైద్యులు తమ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. కానీ, ఓ డాక్టర్‌గా భార్య మరణించిందని గుర్తించిన ఆయన చివరకు ఆమె మరణించినట్టు స్వయంగా ప్రకటించారు. నాటి ఘటనలను ఆయన తాజాగా మీడియాతో పంచుకున్నారు.

Updated Date - 2023-09-29T22:58:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising