ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: పల్నాడు బిడ్డ ఇందిర భారతీయులందరికీ గర్వకారణం: విదేశీ వ్యవహారాల కార్యదర్శి

ABN, First Publish Date - 2023-03-20T17:08:36+05:30

ఈగలపాటి ఇందిర.. గల్ఫ్ దేశాలలో ఉంటున్న భారతీయులందరికీ గర్వకారణమని విదేశీ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ ఔసాఫ్ సయాద్ పెర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అబల కాదు అమె సబల, ఆకాశంలో సగం కాదు ఇంకా ఎక్కువ కావాలంటుంది, పల్లె నుండి వచ్చిన అమె పల్లకీలో కూర్చొని ఎడారి నాట తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈగలపాటి ఇందిర.. గల్ఫ్ దేశాలలో ఉంటున్న భారతీయులందరికీ గర్వకారణమని విదేశీ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ ఔసాఫ్ సయాద్ పెర్కొన్నారు. సౌదీ అరేబియా ఉన్నతాధికారులతో ద్వైపాక్షిక సంబంధాల గూర్చి చర్చించడానికి న్యూ ఢిల్లీ నుండి వచ్చిన ఆయనతో రియాధ్ నగరంలో ఆదివారం జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ఇందిర ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారతీయ రాయబారి డాక్టర్ సోహేల్ ఏజాజ్ ఇతర భారతీయ అధికారులు, ప్రముఖులందరి సమక్షంలో తెలుగునాట ఒక పల్లె నుండి ప్రతికూల పరిస్ధితులను ఎదుర్కొంటూ మెట్రో పైలట్‌గా ఎదిగి సౌదీ అరేబియాలో పని చేయడాన్ని ఔసాఫ్ సయీద్ అభినందించారు. సౌదీ అరేబియాలో భారత ప్రతిష్ఠను పెంపొందించే వ్యక్తులలో ఇందిర ఒకరని భారతీయ దౌత్యవేత్తలు ప్రశంసించారు.

​పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామానికి చెందిన ఇందిర ప్రస్ధానం గూర్చి ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన అనంతరం అమె గూర్చి తెలుసుకోవడానికి ప్రవాసీయులు ఎనలేని ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇందిర గూర్చి తెలుసుకోన్న భారతీయ రాయబారి ప్రత్యేకంగా అమెను పిలిపించి తన కుటుంబ సభ్యులకు పరిచయం చేసారు. అదే విధంగా భారతీయ అధికారులు, ఇతర ప్రముఖులు కూడా తమ కూతుళ్ళను ఇందిరకు పరిచయం చేస్తూ అమెను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. 25 లక్షలకు మందికి పైగా భారతీయులు ఉంటున్న సౌదీ అరేబియాలో ఒక భారతీయ మహిళ అందునా తెలుగు మహిళకు దక్కిన తొలి గౌరవం ఇది.

Updated Date - 2023-03-20T17:11:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising