ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: పోస్ట్‌గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ల కాలపరిమితి పొడిగించనున్న కెనడా..

ABN, First Publish Date - 2023-03-19T21:27:01+05:30

కెనడాలో ఉంటున్న విదేశీయులకు ఓ గుడ్ న్యూస్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లు కాలవ్యవధిని మరో 18 నెలల పాటు పొడిగించేందుకు నిర్ణయించినట్టు కెనడా ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎన్నారై డెస్క్: కెనడాలో(Canada) ఉంటున్న విదేశీయులకు ఓ గుడ్ న్యూస్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లు(పీజీడబ్ల్యూపీ-PGWP) కాలవ్యవధిని మరో 18 నెలల పాటు పొడిగించేందుకు నిర్ణయించినట్టు కెనడా తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం వర్క్‌ పర్మిట్ల కాల పరిమితి ముగిసిన వారు, త్వరలో వర్క్ పర్మిట్లు ముగియనున్న వారికి ఈ పొడిగింపు(Work permit extension) వర్తిస్తుందని పేర్కొంది. పీజీడబ్ల్యూపీ సాయంతో విదేశీ విద్యార్థులు కెనడాలో తమ రంగాల్లో ఉద్యోగం పొందొచ్చు. తద్వారా అనుభవం గడించవచ్చు. గతంలో పీజీడబ్ల్యూపీ కాలపరిమితి పొడిగింపు సాధ్యమయ్యేది కాదు. కాలపరిమితి ముగిసిన వారికి ప్రభుత్వం ఇతరత్రా వర్క్ పర్మిట్లు జారీ చేసేది. అయితే.. అనేక మంది జాబ్స్ కోల్పోతున్న తరుణంలో ప్రజలను ఆదుకునేందుకు కెనడా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది.

‘‘ఉద్యోగుల కొరతతో ఇబ్బందులు పడుతున్న సంస్థల మేలు కోసం మనం అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి. ఇక విదేశీ విద్యార్థులు కెనడాలో పని అనుభవం పొందేందుకు వారి వర్క్ పర్మిట్లను కాలపరిమితిని పొడిగిస్తాం. తద్వారా వారు కెనడాలో శాశ్వత నివాసార్హత పొందేందుకూ అవకాశం చిక్కుతుంది’’ అని కెనడా వలసల శాఖ మంత్రి షాన్ ఫ్రేసర్ పేర్కొన్నారు. కెనడాలోని ఉద్యోగుల కొరత తీర్చడంలో ఈ చర్య ఎంతో ఉపకరిస్తుందని కెనడా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2022 చివరి నాటికి కెనడాలో పీజీడబ్ల్యూపీ కలిగిన విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు 2.86 లక్షలు. ఇక 2023లో సుమారు 1.27 లక్షల వర్క్ పర్మిట్లు ఎక్స్‌పైర్ కానున్నాయి. అయితే.. విదేశీ విద్యార్థుల్లో సుమారు 67 వేల మంది ఇప్పటికే కెనడాలో శాశ్వత నివాసానుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి.. వీరికి పీజీడబ్ల్యూపీ కాలపరిమితి పొడిగించాల్సి రాకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - 2023-03-19T21:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising