ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YouTube : వీడియోస్‌తో ఇన్ఫో చోరీ

ABN, First Publish Date - 2023-03-17T23:26:36+05:30

మంచిని పొంచి చెడూ ఉంటుందని అనడానికి ఇదో పెద్ద ఉదాహరణ. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో ఒనగూడే ప్రయోజనాలను పక్కన పెడితే,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మంచిని పొంచి చెడూ ఉంటుందని అనడానికి ఇదో పెద్ద ఉదాహరణ. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో ఒనగూడే ప్రయోజనాలను పక్కన పెడితే, సరిగ్గా ఇదే ఉపయోగించి సమాచార తస్కరణ, అందుకు యూట్యూబ్‌ వీడియోలను హ్యాకర్లు ఉపయోగించుకోవడం విశేషం. ఎఐతో జనరేట్‌ చేసే యూట్యూబ్‌ వీడియోస్‌తో మాల్వేర్‌ను విస్తరిస్తున్నట్టు సమాచారం. ఐటీ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘క్లౌడ్‌సెక్‌’ ప్రకారం గత ఏడాది నవంబర్‌ నుంచి నెల నెలా 200 నుంచి 300 శాతం మేర ఈ రకమైన మోసాలు జరుగుతున్నాయి. విడార్‌, రెడ్‌లైన్‌, రకూన్‌ వంటి స్టీలర్‌ మాల్వేర్‌ లింకులను ఉపయోగిస్తున్నారు. ఈ వీడియోలు ట్యుటోరియల్స్‌ మాదిరిగా ఉంటాయి. ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, ఆటోడెస్క్‌ 3డి ఎస్‌ మ్యాక్స్‌, ఆటోక్యాడ్‌ తదితరాలను క్రాక్‌ చేసినట్టు కనపడతాయి. పైపెచ్చు డౌన్‌లోడ్‌ చేసుకోదగ్గ వీడియోలు అనిపిస్తాయి. సాధారణంగా ఇలాంటి వీడియోలు స్టెప్‌ బై స్టెప్‌ విశదపరిచే విధంగా ఉంటాయి. అలాగే సింధీసియా, డి-ఐడి వంటి ట్యుటోరియల్‌ వీడియోస్‌ మాదిరిగా ఉంటాయి.

ఇలా అందుబాటులోకి తీసుకువచ్చిన వీడియోలతో పాస్‌వర్డ్స్‌, క్రెడిట్‌ కార్డ్‌ ఇన్ఫర్మేషన్‌, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్స్‌ సహా కాన్ఫిడెన్షియల్‌ డేటాను సంగ్రహిస్తూ ఉంటారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న ఆ వీడియో నిజమని నమ్మితే చాలు, హ్యాకర్లు తమ పని కానిచ్చేస్తారు. య్యూట్యూబ్‌కు రెండున్నర బిలియన్ల మంది నెలవారి యూజర్లు ఉంటారు. అందులో ట్యుటోరియల్స్‌ కోసం చూసేవారు ఉంటారు. అలాగే యూట్యూబ్‌ వైపు నుంచి రెగ్యులేషన్‌ ప్రాసెస్‌ కూడా ఉంటుంది. కనీసం ఒక లక్షమందిని వీరు ఆకట్టుకుంటారు. కొంతమంది ఎఫెక్ట్‌ అయ్యారనగానే వాటిని నిషేధించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదో నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉండటం గమనార్హం.

సింగిల్‌ స్ర్కీన్‌పై నాలుగు మ్యాచ్‌లు

ఒకేసారి మూడు నాలుగు మ్యాచ్‌లు జరుగుతుంటే, అన్నీ చూడాలని అనుకుంటే - అందుకు అనువుగా మల్టీవ్యూ ఫీచర్‌ను యూట్యూబ్‌ రూపొందిస్తోంది. ఇంతవరకు అన్నింటినీ చూసుకునేందుకు ల్యాప్‌టాప్‌, మొబైల్‌, టీవీని ఉపయోగిస్తున్నారు. అందుకుబదులు మల్టీవ్యూకు యూట్యూబ్‌ శ్రీకారం చుడుతోంది. ‘టాప్‌ పిక్స్‌ ఫర్‌ యు’ సెక్షన్‌లో ఇప్పటికే కొంత మంది ఒకే స్ర్కీన్‌పై నాలుగు మ్యాచ్‌లను చూస్తున్నారు. అయితే ఈ స్ట్రీమ్స్‌ను ముందే ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రసారం కోసం హైపవర్డ్‌ డివైజ్‌ అవసరమవుతుంది. అంటే సదరు ప్రసారాలకు అవసరమైన ఎక్వి్‌పమెంట్‌ ఉన్న డివైజ్‌ ఉండాలి. యూట్యూబ్‌ సర్వర్లపై పనిచేసేందుకు వీలుగా ప్రాసెసింగ్‌ అంతా యూట్యూబ్‌ చేస్తోంది. ఎన్‌సీఏఏ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌ను టెలికాస్ట్‌ చేసే చానల్స్‌కు అనువుగా మాత్రమే ఈ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-03-17T23:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising