Life Tips : ఆకర్షణ తగ్గకుండా
ABN, First Publish Date - 2023-01-20T22:39:08+05:30
వర్కింగ్ కపుల్‌కు వారాంతాల్లో తీరిక చిక్కుతుంది. ఆ సమయాన్ని మిగతా పనులకే వెచ్చించకుండా, అనుబంధం బలపడడం కోసం కూడా కేటాయిస్తూ ఉండాలి. చిన్న చిన్న చిట్కాలతో కోల్పోయిన స్పార్క్‌ను తిరిగి జీవితాల్లోకి ఆహ్వానించాలి.
వర్కింగ్ కపుల్‌కు వారాంతాల్లో తీరిక చిక్కుతుంది. ఆ సమయాన్ని మిగతా పనులకే వెచ్చించకుండా, అనుబంధం బలపడడం కోసం కూడా కేటాయిస్తూ ఉండాలి. చిన్న చిన్న చిట్కాలతో కోల్పోయిన స్పార్క్‌ను తిరిగి జీవితాల్లోకి ఆహ్వానించాలి.
ఇండోర్ గేమ్స్: ఆఫీసు పని, ఇంటి పనితోనే సరిపెట్టుకోకుండా ఇద్దరూ కలిసి క్యారమ్స్, ప్లేయింగ్ కార్డ్స్, లూడో, చెస్ మొదలైన ఇండోర్ గేమ్స్ ఆడాలి. ఆటలతో ఒత్తిడి తొలగడంతో పాటు, కాలక్షేపం దక్కుతుంది. కలిసి నాణ్యమైన సమయం గడిపామనే సంతృప్తి దక్కుతుంది.
పాత జ్ఞాపకాలు: పెళ్లి నాటి ఫొటో ఆల్బమ్‌ను తిరగేస్తే పాత జ్ఞాపకాలతో మానసికోల్లాసం దక్కుతుంది. ఒకప్పటి గుర్తులు, సంఘటనలు కళ్ల ముందు మెదిలి, దంపతుల మధ్య దూరాలు తరుగుతాయి.
సరదాగా: సరదా టెక్స్ట్ మెసేజీలు పంపుకుంటూ, ఒకర్నొకరు టీజ్ చేసుకుంటూ ఉండాలి. సరికొత్త వంటకాలతో భార్య భర్తనూ, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించిన సర్‌ప్రైజ్ గిఫ్ట్స్‌తో భర్త భార్యనూ సర్‌ప్రైజ్ చేసుకోవచ్చు.
పనుల్లో భాగస్వామ్యం: ఇంటి పనులు కలిసి చేయడం ద్వారా కూడా దంపతులు తమ మధ్య తగ్గే అన్యోన్యతను పెంచుకోవచ్చు. కూరగాయలు తరగడం, మిక్సీ, వాషింగ్ మెషిన్, గార్డెనింగ్ పనులతో భర్తలు భార్యలకు సహాయపడవచ్చు. అలాగే భార్యలు కూడా భర్తల పనుల్లో పాలుపంచుకోవచ్చు.
Updated Date - 2023-01-20T22:39:09+05:30 IST