Google Chrome : మొబైల్‌లోనూ బ్లాకింగ్ ఫీచర్
ABN, First Publish Date - 2023-03-17T23:40:38+05:30
ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ లేకుండా పని గడవదు. అంతేకాదు కరోనా తరవాత విద్యార్థులకు మొబైల్ ఫోన్ ఇవ్వక తప్పడం లేదు. అలాంటి సందర్భాల్లో గూగుల్ క్రోమ్‌లో వెబ్‌సైట్స్ బ్లాకింగ్ ఫీచర్ ..
ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ లేకుండా పని గడవదు. అంతేకాదు కరోనా తరవాత విద్యార్థులకు మొబైల్ ఫోన్ ఇవ్వక తప్పడం లేదు. అలాంటి సందర్భాల్లో గూగుల్ క్రోమ్‌లో వెబ్‌సైట్స్ బ్లాకింగ్ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. హానికరమైన వైరస్, అడల్ట్, గేమ్స్ కంటెంట్ నిరోధానికి ఉపయోగపడుతుంది. స్మార్ట్‌వాచీ ఉంటే గూగుల్ క్రోమ్ బ్లాకింగ్ ఫీచర్‌తో వెబ్‌సైట్స్‌పై ఎంతసేపు ఉండొచ్చు అనే విషయంలో టైమ్ లిమిట్ పెట్టుకోవచ్చు. మన సమయం మరింత ఉత్పాదకంగా ఉంచుకునేందుకు ఇది తోడ్పడుతుంది. అన్ని సైట్స్‌కు సంబంధించి సెట్టింగ్స్‌లో చేంజ్ కోసం..
ఆండ్రాయిడ్ ఫోన్ లేదంటే టాబ్లెట్‌లో గూగుల్ క్రోమ్‌ను ఓపెన్ చేయాలి.
అడ్రస్ బార్ కుడివైపు ‘మోర్ మోర్’ని టాప్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి.
‘అడ్వాన్స్‌డ్’ టాప్ సెట్టింగ్స్‌లో అప్డేట్ చేయాలనుకున్న పర్మిషన్‌ను టాప్ చేయాలి.
సైట్ కోసం సెట్టింగ్స్‌ను మార్చాలి.
ప్రత్యేకించి సైట్ పర్మిషన్ విషయంలో అలౌ లేదంటే బ్లాక్ చేయవచ్చు. దాంతో డిఫాల్ట్ సెట్టింగ్స్‌కు బదులు సెట్ చేసిన పర్మిషన్స్‌కు అనుగుణంగా సైట్ పనిచేస్తుంది.
ఆండ్రాయిడ్ ఫోన్ లేదంటే టాబ్‌లో క్రోమ్‌ను ఓపెన్ చేసి సైట్‌లోకి వెళ్ళాలి.
అడ్రస్ బార్ ఎడమవైపు ‘లాక్ లాక్’ని టాప్‌చేసి పర్మిషన్స్‌లోకి వెళ్ళాలి.
అప్డేట్ చేయాలనుకున్న దాని పర్మిషన్‌ను టాప్ చేయాలి.
చేంజ్ చేయాలని అనుకున్న సెట్టింగ్‌ను సెలెక్ట్ చేయాలి.
సైట్ సెట్టింగ్స్‌ను క్లియర్ చేసేందుకు రీసెట్ పర్మిషన్స్‌ను టాప్ చేయాలి.
(సైట్‌లో సెట్టింగ్‌ను మార్చాలని అనుకున్నప్పుడు ఐకాన్‌కు తరవాత ఉండే పేరులో చిన్నపాటి మార్పు చేయాలి. ఉదాహరణకు సైట్ లొకేషన్ యాక్సెస్‌లో మార్పు కోసం లొకేషన్ పిన్‌ని - సైట్‌కు చెందిన ఐకాన్ ఆ పని చేస్తుంది.)
Updated Date - 2023-03-17T23:40:38+05:30 IST