ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Venu : విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నా

ABN, First Publish Date - 2023-09-17T05:15:47+05:30

వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా ప్రధాన పాత్రలు పోషించిన వెబ్‌ సిరీస్‌ ‘అతిఽధి ఈ నెల 19 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరించిన ఈ సిరీ్‌సకు భరత్‌ వైజీ దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌ సిరీ్‌సలోని మొదటి,

-వేణు

వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా ప్రధాన పాత్రలు పోషించిన వెబ్‌ సిరీస్‌ ‘అతిఽధి ఈ నెల 19 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరించిన ఈ సిరీ్‌సకు భరత్‌ వైజీ దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌ సిరీ్‌సలోని మొదటి, రెండు ఎపిసోడ్స్‌ను మీడియాకు శనివారం ప్రదర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో వేణు మాట్లాడుతూ ‘కరోనా సమయంలో వెబ్‌ సిరీస్‌ చాలా చూశాను. అప్పుడే వెబ్‌ సిరీస్‌ చేయాలని అనుకున్నాను. ఆ సమయంలోనే ‘అతిధి’ స్ర్కిప్ట్‌ నా దగ్గరకు వచ్చింది. ఇవాళ ఓటీటీలో చాలా కంటెంట్‌ వస్తోంది కానీ ఎవరికి వారు గదుల్లో కూర్చుని చూస్తున్నారు. అడల్డ్‌ కంటెంట్‌ ఉంటోంది. అందుకే అలాంటివి ఏమీ లేకుండా కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చేయాలని చెప్పాను. దర్శకుడు భరత్‌ అలాగే చేశాడు. ‘అతిధి’లో కామెడీ, హారర్‌ అంశాలను పక్కన పెడితే అందరూ కలసి హాయిగా చూడగలిగే కథ ఇది. అందుకే ఒప్పుకొన్నాను. కెరీర్‌లో ఒక ఫేజ్‌ చూశాను. ఇప్పుడు విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఇకపై మంచి కథలు వస్తే వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తాన. నా ఫ్రెండ్‌ త్రివిక్రమ్‌, నేను ఒకేసారి కెరీర్‌ ప్రారంభించాం. మాకు ఒకరి గురించి మరొకరికి తెలుసు. తన సినిమాల్లో నాకు సరిపోయే పాత్ర ఉంటే తప్పకుండా పిలుస్తాడు. ఆయన సినిమాలో నటించడం నాకు కూడా ఇష్టం’ అన్నారు. తన జీవితంలో చూసిన ఓ సంఘటన స్ఫూర్తితో ‘అతిధి’ వెబ్‌ సిరీస్‌ రూపొందించినట్లు దర్శకుడు భరత్‌ చెప్పారు. ‘ఈ సిరీ్‌సలో మొదట ఉపేంద్రను తీసుకుందామని అనుకున్నాం. ఆ టైమ్‌లోనే పునీత్‌ రాజ్‌కుమార్‌ చనిిపోవడంతో కన్నడ చిత్రపరిశ్రమలో బాధలో ఉంది. ఆ తర్వాత డిస్కషన్స్‌లో వేణు పేరు వచ్చింది.’ అని వివరించారు ఆయన.

Updated Date - 2023-09-17T05:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising