Varuntej and Lavanya Tripathi: పెళ్లి ఇటలీలోనా..?
ABN, First Publish Date - 2023-06-11T04:00:42+05:30
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం సింపుల్‌గా జరిగిపోయింది. ఇక అందరి దృష్టీ పెళ్లి పైనే. వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? వివాహ వేదిక ఎక్కడ?
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం సింపుల్‌గా జరిగిపోయింది. ఇక అందరి దృష్టీ పెళ్లి పైనే. వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? వివాహ వేదిక ఎక్కడ? అంటూ ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. ఇప్పటికైతే ఇటలీలో వీళ్ల వివాహం జరగబోతోందని సమాచారం. ఈమధ్య డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు క్రేజ్ ఎక్కువగా ఉంది. అందుకే ఇటలీలో పెళ్లి ఫిక్స్ చేశారని సమాచారం. ఇటలీనే ఎంచుకోవడానికి మరో ప్రధాన కారణం ఉంది. వరుణ్, లావణ్యల ప్రేమ చిగురించింది అక్కడేనట. వీరిద్దరూ ‘మిస్టర్’ చిత్రంలో కలిసి నటించారు. అక్కడే వీరి ప్రేమ చిగురించింది. ఆ తరవాత.. ‘అంతరిక్షం’లో మళ్లీ జోడీ కట్టారు. అప్పటికే వీరిద్దరూ ప్రేమ పక్షులుగా మారిపోయారు. తమ ప్రేమ పుట్టిన ఇటలీలోనే పెళ్లి చేసుకోవాలని వరుణ్, లావణ్యలు భావించార్ట. అందుకే ఇటలీని ఎంచుకొన్నారు. నిశ్చితార్థం సింపుల్‌గా చేసినా, పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేయాలని ఫిక్సయ్యార్ట. వివాహ తేదీ కూడా నిర్ణయం అయిపోయిందని, త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Updated Date - 2023-06-11T04:00:52+05:30 IST