పిల్లికి బుద్ధి చెప్పిన ఎలుక!
ABN, First Publish Date - 2023-01-13T22:40:11+05:30
ఒక చోట ఐదు ఎలుకలుండేవి. ఎక్కడికెళ్లినా గుంపుగా వెళ్లేవి. షానీ అనే ఎలుక అందరికంటే పెద్దది. కాస్త లావు. పుష్టికరంగా తిండి
ఒక చోట ఐదు ఎలుకలుండేవి. ఎక్కడికెళ్లినా గుంపుగా వెళ్లేవి. షానీ అనే ఎలుక అందరికంటే పెద్దది. కాస్త లావు. పుష్టికరంగా తిండి తినే బాపతు అది. ప్రతిరోజూ చేలల్లోకి వెళ్లి తిండి తినేసి వచ్చేవి. కొన్నాళ్ల తర్వాత అక్కడకి ఓ పిల్లి వచ్చింది. చుట్టు పక్కల ఉండే ఎలుకల్ని చంపి తినిందనే వార్త వచ్చింది. ఒక రోజు ఎలుకలన్నీ రాత్రికి రాత్రే సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. మీకో విషయం తెలుసా.. ‘నాకు నిన్న రాత్రి కలలో ఆ రాక్షసి పిల్లి కలలోకి వచ్చింది. దాన్ని ఆటాడు కున్నా’ అంది షానీ. మిగతా ఎలుకలన్నీ నవ్వాయి. మరుసటి రోజు ఎలుకలన్నీ తిండికి వెళ్తోంటే.. దూరంగా పిల్లి కనపడగానే ఎలుకలు బొరియల్లో దాక్కున్నా యి. అంతలోనే ఆ బొరియలకు దగ్గరలో ఉన్న ఓ ఇంటి దగ్గర కు షానీ వెళ్లింది. అక్కడ టామీ స్నేహితుడు ఉన్నాడు. విషయమం తా చెప్పిం ది. ఓ ఉపాయం చెప్పింది. మరుసటి రోజు ఎలుక దర్జాగా ఆ ఇంటి దగ్గర తిరుగుతోంటే పిల్లి చూసింది. ఆహా.. ఈ ఎలుకను తింటే ఎంత రుచిగా ఉంటుందో.. అనుకుంది. అయినా నేను ఉన్నానని తెలీదా? అంటూ ఎలుక దగ్గరకు కోపంతో వెళ్లింది. పిల్లిని చూసి షానీ ఎలుక భయపడింది. పైకి నవ్వుతూ ఇలా అంది. ‘మిమ్మలను ఎప్పుడూ చూడలేదు. అయితే మీకు కనికరం లేదనే విషయం తెలుసు’ అన్నది.
పిల్లి గర్వంగా ఫీలయింది. అంతలోనే ‘మీకో సవాల్ విసురుతున్నా. స్వీకరిం చగలిగే దుమ్ముందా?’ అంటూ పిల్లిని రెచ్చగొట్టింది షానీ. ‘పరిగెతి ్తతే నన్ను పట్టుకోవాలి’ అన్నది. పిల్లి నవ్వింది. ఇలాంటి సవాళ్లు కొత్తకాదు అన్నది. ఇపుడు నన్ను పట్టుకో అన్నది షానీ. ఈ వేగం నాకు రాదా? అంటూ మెల్లిగా గెంతులేసుకుంటే సరదాగా పరిగెత్తింది పిల్లి. షానీ తెలివిగా కుర్చీమీద నుంచి పైకి ఎగిరింది. దాని వెనకాల టామీ ఉందనే విష యం తెలీక పిల్లి ఎగిరింది. టామీ మీద పడుతూనే.. పిల్లి మెడ పట్టేసుకుంది. టామీని చూస్తూనే పిల్లి ప్రాణాలు గాల్లోకి పోయాయి. పిల్లిని వదలకుండా పట్టేసుకుని భయపెట్టింది. ఈ ప్రాంతం వదిలేసి వెళ్లు.. లేకుం టే చంపేస్తానంది. అలా పిల్లి అక్కడనుంచి బ్రతుకుజీవుడా! అనుకుంటూ పారిపోయింది. ఈ విషయం తెలిసి ఎలుకలన్నీ సంతోషపడ్డాయి.
Updated Date - 2023-01-13T22:40:13+05:30 IST