ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bible : ఇశ్రాయేలీయులు

ABN, First Publish Date - 2023-09-22T03:41:06+05:30

బైబిల్‌లో ఇశ్రాయేలీయుల ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. హీబ్రూ భాషలో ‘ఇశ్రాయేలు’ అంటే ‘దేవుడితో పోరాటం చేసేవాడు’ అని అర్థం. పలు మతాలకు మూలపురుషుడైన అబ్రహంకు లేకలేక కలిగిన కుమారుడు ఇస్సాకు.

బైబిల్‌లో ఇశ్రాయేలీయుల ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. హీబ్రూ భాషలో ‘ఇశ్రాయేలు’ అంటే ‘దేవుడితో పోరాటం చేసేవాడు’ అని అర్థం. పలు మతాలకు మూలపురుషుడైన అబ్రహంకు లేకలేక కలిగిన కుమారుడు ఇస్సాకు. అబ్రహంను దేవుడు పరీక్షించాలనుకున్నాడు. అతనికి ప్రియమైన కుమారుడు ఇస్సాకును బలి ఇవ్వాలని ఆదేశించాడు. అబ్రహం అందుకు సిద్ధపడ్డాడు. కానీ సర్వప్రాణులకూ తండ్రి అయిన దేవుడు సామాన్యుల ఊహలకు అందేవాడు కాదు. ధర్మపరులకు క్షోభ కలిగించేవాడు కాదు. ఒప్పందం ప్రకారం... ఇస్సాకును అబ్రహం బలి ఇచ్చే సమయంలో... దేవుడు అద్భుతం చేశాడు. ఆ బలిని మళ్ళించాడు. ఇస్సాకు స్థానంలో ఒక ‘బకర్‌’ (గొర్రె) ఉండేలా చేశాడు. ‘బక్రీద్‌’ అలా వచ్చిందే. ఆ విధంగా చిరంజీవి అయిన ఇస్సాకు కుమారుడు యాకోబు. అతనికి ఇద్దరు భార్యల ద్వారా 12 మంది కుమారులు కలిగారు. ఆ 12 మంది వారసుల పరంపరలో... అంటే పన్నెండు తెగల్లో యూదా ఒకటి. ఏసు ప్రభువు ఆ తెగలోనే అవతరించాడు.

యాకోబు కుమారులైన రూబేను నుంచి బెంజిమిన్‌ వరకూ ఉన్న పన్నెండు తెగల సంతతి అంతా ఇశ్రాయేలీయులే. ఇస్సాకు చిన్న కొడుకైన యాకోబు ‘ఇశ్రాయేలు’గా ప్రసిద్ధి చెందాడు. ఆయన సంతతిని ఇశ్రాయేలీయులుగా వ్యవహరిస్తారు. ఈ ఇశ్రాయేలీయుల తాత అయిన అబ్రహంకు దేవుడు ఒక సందర్భంలో తన వాణిని వినిపిస్తూ.... ‘‘అబ్రహం! నీ సంతతి ఎంతో విస్తృతం అవుతుంది. వారిని లెక్కించడం ఎవరితరం? ఆకాశంలోని నక్షత్రాలు చాలవు. ఇసుక సంఖ్యా చాలదు’’ అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు దేవుడికి అత్యంత ఇష్టులు. కానీ వారు ఐగుప్తేయులకు బందీలై, వారికి దాస్యం చేస్తూ... నాలుగువందల ఏళ్ళపాటు మగ్గిపోయారు. వారినుంచే ఉద్భవించిన మహానాయకుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు విమోచన కలిగింది. అప్పటివరకూ వారు తమ స్వదేశంలో అడుగుపెట్టలేకపోయారు. ఇదంతా పాపవిమోచనకు సూచన అనీ, అంతా దైవ ప్రణాళిక ప్రకారమే జరిగిందనీ బైబిల్‌ చెబుతోంది.

డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు

9866755024

Updated Date - 2023-09-22T03:44:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising