Kitchen Tips : ఇల్లు అందంగా..
ABN, First Publish Date - 2023-07-21T23:46:51+05:30
ఇంటి ముందు భాగం ఉండే డోర్లు విభిన్నంగా ఎంచుకోవాలి. ద్వారమే మీ అభిరుచిని తెలియచేస్తుంది. ఇంట్లో గదుల రంగులన్నీ తెలుపు లేదా లైట్ కలర్స్‌ను మాత్రమే వాడాలి. ఇంట్లో గదులు చిన్నగా ఉంటే గోడ
ఇంటి ముందు భాగం ఉండే డోర్లు విభిన్నంగా ఎంచుకోవాలి. ద్వారమే మీ అభిరుచిని తెలియచేస్తుంది.
ఇంట్లో గదుల రంగులన్నీ తెలుపు లేదా లైట్ కలర్స్‌ను మాత్రమే వాడాలి. ఇంట్లో గదులు చిన్నగా ఉంటే గోడ సగం వైట్ కలర్, మిగతా భాగం లైట్ కలర్ వాడాలి. పొరబాటున కూడా ఏదో కొత్తగా ఉంటుందని డార్క్ కలర్స్ డిజైన్ చేయించుకుంటే మాత్రం రూమ్స్ చిన్నగా అనిపిస్తాయి.
లివింగ్ ఏరియాలో సోఫాతో కుర్చీలు మాట్లాడుకున్నట్లు పొందుపరచాలి. సోఫాలో విపరీతమైన కలర్స్ కాకుండా కూల్‌గా ఉండేట్లు చూసుకోవాలి. హాల్ మరీ చిన్నదైతే పెద్ద సోఫాలు పెట్టాలని మాత్రం ప్రయత్నించకండి. గ్లాస్ టేబుల్ మీద పూలకుండీ ఉండే అందంగా కనపడుతుంది.
డెకరేటెడ్ ఫ్రేమ్స్ హాల్లో లేదా ఇతర గదుల్లో మరీ ఎక్కువగా ఉన్నా బావుండదు. అందుకే ఒకటో, రెండో మాత్రమే ఉండాలి.
కర్టెన్ల విషయంలో మాత్రం కాస్త ఆలోచించాలి. ఎండాకాలం వెలుగు లోపలకు మరీ ఎక్కువ రాకుండా థిక్ కర్టెన్స్ వాడితే.. వానాకాలంలో మాత్రం షియర్ కర్టెన్స్ వాడటం మంచిది. అలాగని ప్రతి చిన్న కిటికీకి కర్టెన్లు వాడితే అందం పోతుంది.
పిల్లల గదులను కాస్త కొత్తగా అలంకరించుకోవచ్చు. వీలుంటే ఖాళీ గోడ ఉంచాలి. వాటిపైౖ స్టిక్కర్లు, వారి అభిరుచికి తగినట్లు డిజైన్లు చేసుకోవటానికి వీలుగా ఉండాలి. అమ్మాయిలకు పింక్, అబ్బాయిలకు నీలం.. ఇలా రంగుల జోలికి పోకుండా.. పిల్లల గదుల్లో కూల్స్ కలర్స్‌కే ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇంట్లో వెలుతురు ముఖ్యం. అయితే మరీ తెల్లగా మెరిసిపోయేట్లు లైట్లను ఎక్కడంటే అక్కడ అమర్చకూడదు. కూల్‌గా ఉండే లేటెస్ట్ టెక్నాలజీ బల్బులను వాడాలి. వీలైతే పిల్లల గదుల్లో స్మార్ట్‌బల్బుల్ని ఫిక్స్ చేసుకోవాలి.
కేవలం హాల్‌లో మాత్రమే తివాచీలు వాడటం మంచిది. ఒక గదిలో వెరైటీగా ఉండటం కోసం కిటికీ లాండే ఫేక్ మిర్రర్ లాంటివి ఏర్పాటు చేసుకుంటే బావుంటుంది.
ఇంట్లో చిందరవందరగా వస్తువులను ఉంచినట్లు కాకుండా కూల్‌గా ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో తెలియటం కూడా ఓ కళే.
Updated Date - 2023-07-21T23:47:11+05:30 IST