ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Poland : దేశం పోలండ్‌

ABN, First Publish Date - 2023-01-05T23:48:54+05:30

పోలెండ్‌ అనే పదం పోలెనీ అనే ట్రైబల్‌ జాతి నుంచి వచ్చింది. పోలెనీ అంటే మైదానాల్లో జీవించే మనుషులు అని అర్థం. పోలెనీ అనే పదమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పోలెండ్‌ అనే పదం పోలెనీ అనే ట్రైబల్‌ జాతి నుంచి వచ్చింది. పోలెనీ అంటే మైదానాల్లో జీవించే మనుషులు అని అర్థం. పోలెనీ అనే పదమే.. పోలండ్‌గా మారింది. ఇది మధ్య యూర్‌పలో ఉంటుంది. జనాభా 38 మిలియన్లు.

  • పోలండ్‌ ప్రజలు పోలిష్‌ భాష మాట్లాడతారు. ఈ భాషలో 32 అక్షరాలుంటాయి. ప్రపంచంలోని అతి కష్టమైన భాషల్లో పోలిష్‌ భాష ఒకటి. ఇక ఈ దేశాన్ని ‘సెవెన్‌ వండర్స్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ అని కూడా పిలుస్తారు. అంటే ఇక్కడ అంత ప్రాచీనమైన వండర్స్‌ ఉన్నాయని అర్థం. ‘మల్‌బోర్క్‌ కాజిల్‌’ పాపులర్‌. 13 శతాబ్దంలో దీన్ని నిర్మించారు. యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రాత్మక స్థలమిది. యూర్‌పలోనే అతి ప్రాచీనమైన రెస్టారంట్‌ ఇక్కడ ఉంది. దీనిపేరు ‘పివినిక స్విడినిక’. దీన్ని 1275 సంవత్సరంలో కట్టారు. ఇక్కడ సాల్ట్‌మైన్‌ ఫేమస్‌. ఈ మైన్‌లో 9 అంతస్తుల నిర్మాణాలున్నాయి. చూడటానికి అబ్బురంగా అనిపించేలా వీటి లోపలి నిర్మాణం ఉంటుంది.

  • యూర్‌పలోనే అతి పెద్ద జంతువు బైసన్‌ నివసించేది ఈ దేశంలోనే. ఒక్కో బైసన్‌ 600 కేజీల బరువుంటుంది.

  • ఇక్కడి ప్రజలు అవుట్‌డోర్‌ గేమ్స్‌ని అమితంగా ఇష్టపడతారు. సాకర్‌, వాలీబాల్‌, కార్‌ రేస్‌, బైక్‌రేస్‌, గుర్రపు పందేలంటే వీటికి అమితాసక్తి. వీటితోనే కాలం గడిపే సంఖ్య ఎక్కువ.

  • బుల్లెట్‌ప్రూఫ్‌ వెస్ట్‌, వాకీ-టాకీ, పేపర్‌ క్లిప్స్‌, టూత్‌బ్ర్‌షలాంటి ఇన్వెన్షన్స్‌కి పుట్టినిల్లు. రేడియేషన్‌ మీద ప్రయోగాలు చేసి నోబెల్‌ ప్రైజ్‌ పొందిన మేడమ్‌ క్యూరీ పోలండ్‌ దేశస్థురాలే. ఈ దేశానికి ఫిజిక్స్‌, కెమిస్ర్టీలో 17 నోబెల్‌ బహుమతులు వచ్చాయంటే ఇక్కడి వాళ్ల పరిశోధనతత్వాన్ని అర్థం చేసుకోవచ్చు.

  • ఈ దేశంలోని గ్రామస్తులు పుట్టగొడుగులు తీసుకురావటానికి అడవుల్లోకి, గుట్టల్లోకి వెళ్తుంటారు. ఏవి మంచివో, చెడ్డవో వీరికి అవగాహన ఉంటుంది. పుట్టగొడుగులు తీసుకొచ్చి పక్కింటి వాళ్లు, స్నేహితులకు పంచటం వీరికి సంతోషం.

  • రెండో ప్రపంచ యుద్ధంలో పోలిస్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నాజీలతో గట్టిగా పోరాడింది. ఇకపోతే ఈ దేశంలోని వార్సా నగరాన్ని నాజీలు చేసిన బాంబింగ్‌తో తుడిచిపెట్టుకుపోయింది. ఈ నగరాన్ని మళ్లీ పునర్మించారు.

  • విశ్వానికి సూర్యుడే కేంద్రబిందువు అని ప్రతిపాదించిన ఆస్ర్టానమర్‌ నికోలస్‌ కోపర్నికస్‌ ఈ దేశస్తుడే.

  • ఇక్కడ 100 పైగా బర్డ్స్‌ శాంక్చువరీలున్నాయి. ఇక్కడ మరో విశేషమేంటంటే.. ఇక్కడ ఉండే ప్రజల ప్రతి ఒక్కరి పేరు మీద సెలవుదినం ఉంటుంది. ప్రతిరోజూ సెలబ్రేషనే ఇక్కడ.

Updated Date - 2023-01-05T23:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising