ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Summer Cough, Cold: వేసవిలో వేధించే దగ్గు, జలుబు

ABN, First Publish Date - 2023-04-24T23:01:42+05:30

వేసవిలో విడవకుండా వేధించే దగ్గు, జలుబులకు ఎంటిరోవైరస్‌ కారణం. దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపించే ఈ వైరస్‌ కొద్ది రోజులపాటు బాధించి వెళ్లిపోకుండా వ్యక్తుల్లో ఎక్కువ కాలంపాటు ఉండిపోతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంటిరోవైరస్‌

వేసవిలో విడవకుండా వేధించే దగ్గు, జలుబులకు ఎంటిరోవైరస్‌ కారణం. దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపించే ఈ వైరస్‌ కొద్ది రోజులపాటు బాధించి వెళ్లిపోకుండా వ్యక్తుల్లో ఎక్కువ కాలంపాటు ఉండిపోతుంది. అలాగని విపరీతమైన లక్షణాల రూపంలో బయటపడదు. తెరలుగా వేధించే దగ్గు, శ్లేష్మం రూపంలో అడపాదడపా కనిపిస్తూ అంతర్గతంగా వ్యాధి ముదిరి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు దారితీసేలా చేస్తుంది.

ఎంత కాలంలోగా వైద్యుల్ని కలవాలి?

జలుబు, దగ్గుల గురించి వైద్యులను కలిసేవాళ్లు చాలా అరుదు. వేసవి వచ్చినా వదలని శ్వాసకోశ సమస్యలకు వైద్యుల్ని తప్పకుండా సంప్రదించాలి. 3 అంతకంటే ఎక్కువ రోజులపాటు జలుబు తగ్గకుండా వేధిస్తూ ఉంటే కచ్చితంగా డాక్టర్‌ని కలవాలి.

పరీక్షలు అవసరమే!

శ్వాసకోశ సమస్యల ప్రారంభంలో ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌, మెడికల్‌ హిస్టరీ తెలుసుకుని వైద్యులు 5 రోజుల పాటు మందులు వాడమని సూచిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కాస్త లోతైన పరీక్షలు కూడా అవసరపడతాయి. వాటి ఫలితాల్ని బట్టి ఏ రకమైన యాంటీబయాటిక్స్‌ వాడాలో వైద్యులు నిర్థారణకొస్తారు. చేయాల్సిన పరీక్షలు ఏవంటే...

చెస్ట్‌ ఎక్స్‌రే (దీంతో న్యుమోనియా తీవ్రత తెలుస్తుంది)

నాసల్‌ స్వాబ్‌ (వైరస్‌ రకం తెలుస్తుంది)

థ్రోట్‌ స్వాబ్‌ (ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించిన తీరు తెలుస్తుంది)

కల్చర్‌ (వైరస్‌ రకం తెలుస్తుంది)

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

శారీరక విశ్రాంతి తీసుకోవాలి.

చల్లని పదార్ధాలకు దూరంగా ఉండాలి.

చల్లని వాతావరణంలోనుంచి హఠాత్తుగా వేడి వాతావరణంలోకి వెళ్లకూడదు.

కాలుష్యానికి గురికాకుండా మాస్క్‌లు, స్కార్ఫ్‌లు వాడాలి.

తుమ్మినప్పుడు, దగ్గేటప్పుడు కర్చీఫ్‌ వాడాలి.

చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

వేడి పదార్థాలే తీసుకోవాలి.

వీలైనంత ఎక్కువగా గోరువెచ్చని నీళ్లు తాగాలి.

ఉపశమనం కోసం వేడి నీటి ఆవిరి పట్టొచ్చు.

చికిత్స

వ్యాధి వ్యాప్తి, తీవ్రతలను బట్టి వైద్యులు చికిత్సను ఎంచుకుంటారు. స్వల్ప ఇన్‌ఫెక్షన్లకు 5 రోజులపాటు మందులు సూచిస్తారు. అప్పటికీ ఇన్‌ఫెక్షన్‌ అదుపులోకి రాకపోతే ఇతరత్రా పరీక్షలు చేసి వైరస్‌ కౌంట్‌, తత్వం, తీవ్రత, ఇన్‌ఫెక్షన్‌ పరిణామాలను బట్టి మరింత సమర్థమైన చికిత్సను అందిస్తారు.

Updated Date - 2023-04-24T23:01:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising