ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fashion : షార్ట్‌ కుర్తా షోకులు

ABN, First Publish Date - 2023-05-02T23:26:38+05:30

పొడవాటి కుర్తా ఫ్యాషన్‌ను షార్ట్‌ కుర్తాలు ఆక్రమిస్తున్నాయి. సౌకర్యానికీ, స్టైల్‌కీ పర్యాయపదంలా ఉండే ఈ షార్ట్‌ కుర్తాలను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొడవాటి కుర్తా ఫ్యాషన్‌ను షార్ట్‌ కుర్తాలు ఆక్రమిస్తున్నాయి. సౌకర్యానికీ, స్టైల్‌కీ పర్యాయపదంలా ఉండే ఈ షార్ట్‌ కుర్తాలను సరైన బాటమ్స్‌తో జోడిస్తే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా వెలిగిపోవచ్చు.

  • జీన్స్‌, లెగ్గింగ్స్‌, జెగ్గింగ్స్‌ ధరించినప్పుడు సౌకర్యంగా ఉండే షార్ట్‌ కుర్తాలు ధరించవచ్చు.

  • కాటన్‌, సింథటిక్‌ మెటీరియల్స్‌లో దొరికే ఈ చిట్టిపొట్టి కుర్తాలు స్టైలిష్‌ లుక్‌ తెచ్చిపెట్టడంతో పాటు, మోడర్న్‌గానూ కనిపిస్తాయి!

  • సౌకర్యానికి పెద్ద పీట వేసే షార్ట్‌ కుర్తాలను లాంగ్‌ స్కర్ట్‌తో కలిపి ధరించవచ్చు.

  • ఈవినింగ్‌ పార్టీలు, ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్స్‌కు షార్ట్‌ కుర్తాలు స్టైలి్‌షగా ఉంటాయి.

  • సింపుల్‌గా, హుందాగా కనిపించాలనుకునేవాళ్లు షార్ట్‌ కుర్తాలను ఎంచుకోవచ్చు.

  • లతలు, పువ్వుల డిజైన్లు ఉన్న షార్ట్‌ కుర్తాలు యాంకిల్‌ లెంగ్త్‌ జీన్స్‌ మీదకు సూటవుతాయి. పెన్సిల్‌ హీల్స్‌ను ఈ డ్రస్‌కు మ్యాచ్‌ చేస్తే చూడముచ్చటగా కనిపించవచ్చు.

  • చికన్‌ వర్క్‌ కుర్తాల్లో షార్ట్‌ లెంగ్త్‌ కూడా ఉంటాయి. ఇవి కాలేజీ అమ్మాయిలకు చక్కగా సూటవుతాయి. సినిమాలు, షికార్లకు ఈ రకం కుర్తాలు అనువైన స్టైల్‌!

  • షార్ట్‌ కుర్తా ఫుల్‌ హ్యాండ్స్‌ వేసినా, షార్ట్‌ హ్యాండ్‌ ఉన్నా, స్లీవ్‌లెస్‌ అయినా.... ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది. కాబట్టి సందర్భాన్ని బట్టి అనువైన కుర్తా ఎంచుకోవాలి!

యాక్సెసరీస్‌ ఇలా...

  • యాంటిక్‌ జ్యువెలరీ, ఉడెన్‌ లేదా టెర్రకోటా జ్యువెలరీ ఈ తరహా దుస్తులకు నప్పుతాయి.

  • స్లింగ్‌ బ్యాగ్‌ చక్కగా మ్యాచ్‌ అవుతుంది.

  • హై హీల్స్‌, ఫ్లాట్స్‌.. రెండు రకాల ఫుట్‌ వేర్‌ వేసుకోవచ్చు.

  • భారీ నెక్లెస్‌లూ, కడాలూ లాంటివి ధరించకపోవడమే మేలు.

Updated Date - 2023-05-02T23:26:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising