ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shehnaz Gill : నేను కాదు.. నా ప్రతిభ మాట్లాడాలి!

ABN, First Publish Date - 2023-06-18T04:22:11+05:30

ఈ పంజాబీ కథానాయిక ఇటీవలే సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘కిసి కా భాయ్‌ కిసీకా జాన్‌’ చిత్రంలో నటించింది. స్వతహాగా సింగర్‌, బిగ్‌బాస్‌ 13 ఫైనలిస్ట్‌ కూడా. వందకు పైగా మ్యూజిక్‌ వీడియోలు చేసింది. ఉత్తరాదిన పాపులర్‌ గాళ్‌.. ఆమే షెహ్‌నాజ్‌ గిల్‌. ఈ బాలీవుడ్‌ బ్యూటీ గురించి కొన్ని విశేషాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ పంజాబీ కథానాయిక ఇటీవలే సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘కిసి కా భాయ్‌ కిసీకా జాన్‌’ చిత్రంలో నటించింది. స్వతహాగా సింగర్‌, బిగ్‌బాస్‌ 13 ఫైనలిస్ట్‌ కూడా. వందకు పైగా మ్యూజిక్‌ వీడియోలు చేసింది. ఉత్తరాదిన పాపులర్‌ గాళ్‌.. ఆమే షెహ్‌నాజ్‌ గిల్‌. ఈ బాలీవుడ్‌ బ్యూటీ గురించి కొన్ని విశేషాలు..

హిందీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన నాకు సల్మాన్‌ఖాన్‌ తన సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వటంలో ఆయన ముందుంటారు. మంచి హ్యూమన్‌బీయింగ్‌. ఏదేమైనా తొలిసారి సినిమా అవకాశం ఇవ్వటం గొప్ప విషయం. అదే కొత్త ఆర్టిస్టుకు కావాల్సింది. దేనికీ భయపడకు.

నీ హార్డ్‌వర్క్‌ను నమ్ముకో. పైకి ఎదుగు. ఒకేచోట స్ట్రక్‌ అవ్వొద్దు అని ఆయన సలహా ఇచ్చారు. మూడు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. భవిష్యత్తులో మంచి కథానాయిక అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. ‘‘సల్మాన్‌ఖాన్‌ సినిమాలో నటించటం మర్చిపోలేను. నిజంగా ఈ బాలీవుడ్‌ మూవీతో గుర్తింపు వచ్చింది. ఎవరీ షెహ్‌నాజ్‌.. అని వెతికారు. ఈ ప్రాజెక్టులో నటించే అవకాశం వచ్చినపుడు ఎగ్జయిట్‌ అయ్యా. ఇంకా మరింత ఫోక్‌సతో పని చేసి ముందుకెళ్లాలనిపించింది.

ఎప్పటికప్పుడు సవాల్‌...

నాకు సినిమాల్లో నటించటం కొత్తేం కాదు. 2017 నుంచి పంజాబీ చిత్రాల్లో నటిస్తున్నా. అక్కడి వాళ్లకు బాగా తెలుసు. నాకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే బాలీవుడ్‌లో ఇవన్నీ కుదరవు. కష్టపడి పని చేయాలి అనుకుని వచ్చా. వాస్తవానికి నేనో సింగర్‌ను. వందల పాటలు పాడాను. దీంతో పాటు వందకు పైగా మ్యూజిక్‌ వీడియోలు చేశా. ‘బాద్‌షా ఫ్లై..’, ‘వాదా హై..’, భూలా దుంగా.., మూన్‌రైజ్‌.., హాబిట్‌.., తూ యహీన్‌ హై.. ఇలా చేసిన మ్యూజిక్‌ వీడియోలన్నీ పాపులర్‌. మిలియన్ల మంది వీక్షించారు. ఆ మాటకొస్తే ఇతర దేశాల్లో కూడా నా అభిమానులున్నారు. ఇలా ఫ్యాన్‌ బేస్‌ ఉన్నా.. ఎప్పటికప్పుడు నన్ను నిరూపించుకోవటం నాకో సవాల్‌!

ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది...

ఎవరైనా పాపులర్‌ అయ్యారంటే అంత సులువుగా కారు. ఆ మాటకొస్తే కేక్‌ వాక్‌ కాదు ఇక్కడ. అవకాశాలు వచ్చినా మనం పని చేయకపోతే నిలబడదు. అందుకే నిరంతరం పనిచేయాలనే మనస్తత్వం నాది. వర్క్‌షాప్స్‌ చేయాలి. నటనకు ఆస్కారం ఉండే పాత్రలొస్తే అందులో మెప్పించాలి. ‘వాహ్‌.. షెహనాజ్‌’ అని అందరినుంచీ మెప్పు వచ్చినప్పుడే.. ఏదో సాధించినట్లు. ప్రతి ఒక్కరిలో ఇన్నర్‌ టాలెంట్‌ ఉంటుంది. అది మనం బ్రష్‌ చేసుకోవాలి. సినిమాల్లోకి వచ్చి అదే ప్రయత్నం ఇప్పుడు

చేస్తున్నా. నేను బాగా నటిస్తున్నా అని చెప్పుకోవటం వేస్ట్‌. నేను కాదు.. నా పని ముందు మాట్లాడాలి. అప్పుడే విజయం సాధించినట్లు.

అలాంటి పాత్రల్లో నటించాలనుంది..

చిన్నప్పటి నుంచీ నటించాలని కలలు కనేదాన్ని. స్కూలింగ్‌ వయసునుంచే సినిమా లవ్‌లో పడిపోయా. తలుపులు మూసేసి ఇంట్లో పాడుతూ డ్యాన్స్‌ వేసేదాన్ని. డైలాగులు చెప్పేదాన్ని. అలా అలవాటు కావటం వల్లనే సులువుగా మ్యూజిక్‌ వీడియోల్లో నటించగలిగా. ఒక్క పంజాబీ, బాలీవుడ్‌ పరిశ్రమలోనే కాదు దక్షిణాది చిత్రాల్లో కూడా నటించాలని ఉంది. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా. మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో నటించానుకుంటున్నా. బలమైన మహిళా పాత్రలకోసం ఎంత హోమ్‌వర్క్‌ అయినా చేస్తా. ఎదురైన సిచ్యువేషన్స్‌ వల్లనే మనం తెలీకుండా రాటుదేలుతాం. అలా ఎప్పటికప్పుడు నాలో స్ర్టెంగ్త్‌ వచ్చింది.

ఇదొక అదృష్టం..

ఇక్కడ మంచి, చెడు, స్టార్డమ్‌, లోఫేజ్‌ అన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ తెలిసే ఇటువైపు వచ్చా. ఏదైనా మాట్లాడటానికి ఇబ్బంది పడను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా. అది కొందరికి నచ్చకపోవచ్చు. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటా. కోటిన్నరకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సోషల్‌ మీడియా పుణ్యాన ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తుంటా. అభిమానులకు విషయం తెలుస్తుంటుంది. తిండి, ప్రయాణాలు, కెరీర్‌.. ఇలా అన్ని అప్‌డేట్స్‌ ఇస్తుంటా. ఇంత మంది ఫాలో అవుతున్నారా? అనుకుంటూ అప్పుడప్పుడు మురిసిపోతుంటా. సినిమాఫీల్డ్‌లో ఉన్నందుకు ఇదొక అదృష్టం అనిపిస్తుంది.

Updated Date - 2023-06-18T04:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising