ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శతపుష్ప.. నూరు గుణాల మొక్క

ABN, First Publish Date - 2023-10-07T03:39:00+05:30

మీ కంటికి నేను ఒక్కదానిగానే కనిపిస్తాను.

కైవాహంబహురసా స్వవాసేనైవవాసినా!

శతపుష్పా వదత్యేచ్ఛత్రం దత్వా జిగీషతా!!

‘‘మీ కంటికి నేను ఒక్కదానిగానే కనిపిస్తాను. కానీ అనేక రుచులు కలిగినదాన్ని. ఏవేవో సుగంధాలు తెచ్చి కలిపి నాకు అదనంగా రుచులు, వాసనలూ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనే ఒక పరిమళాన్ని’ అంటూ శతపుష్ప సగర్వంగా తన విజయాన్ని చాటుకుంటోంది..’’ అంటాడు క్షేమశర్మ తన ‘క్షేమకుతూహలం’ గ్రంథంలో.

‘శతపుష్ప’ అంటే సోప్‌ లేదా సోంప్‌ అని మనం పిలిచే మొక్క. భోజనం చేశాక మౌత్‌ ఫ్రెషనర్‌గా నములుతుంటాం. దీని గురించి మనం చెప్పుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ మొక్క లెక్కలేనన్ని పూలు పూస్తుంది. అందుకని దీన్ని శతపుష్ప అన్నారు. పూలే కాదు... గుణాలు కూడా వందకు మించే ఉన్నాయి దీనికి. గొడుగు ఆకారంలో దీని పూలు ఉంటాయి కాబట్టి దీన్ని ‘శతఛత్రా’ అని కూడా పిలుస్తారు. సంస్కృతంలో ‘సదాప’ అని కూడా అంటారు. ‘సదగుప్పె’ అని కన్నడం వాళ్లు, సదాఫ్‌ అని హిందీ వాళ్లు, సోప్‌ అని మరాఠీ వాళ్లు పిలుస్తారు. ‘ఇండియన్‌ దిల్‌ సీడ్స్‌’ అని ఇంగ్లీషువాళ్లు పిలుస్తారు.

జాఠరాగ్ని పెంచే ఔషధం...

మధురా బృంహణీ బల్యా పుష్టివర్ణాగ్నివర్థనీ! బుతుప్రవర్తనీ ధన్యా యోనిశుక్రవిశోధనీ!

ఉష్ణా వాతప్రశమనీ మంగల్యా పాపనాశనీ! పుత్రప్రదా వీర్యకరి శతపుష్పా నిదర్శితా!

ఇది ‘కాశ్యసంహిత’ అనే ఆయుర్వేద గ్రంథంలో శతపుష్ప గురించి చెప్పిన సూత్రం. సోంపు రుచికరంగా ఉంటుంది. సంతృప్తి ఇస్తుంది. బలకరంగా ఉంటుంది. ధాతు పుష్టిని కలిగిస్తుంది. శరీరానికి మంచి వర్చస్సు ఇస్తుంది. జఠరాగ్నిని ప్రజ్వరిల్లచేస్తుంది. నెలసరిలో రక్తస్రావం సరిగా కాకపోవటాన్ని సరిచేస్తుంది. వాత వ్యాధులున్నవారు సోంపుని నీళ్లలో వేసి చిక్కని టీ లాగా కాచుకుని రోజూ రెండు పూటలా తీసుకొంటే కీళ్లనొప్పుల్లో మార్పు కనిపిస్తుంది. పురుషుల్లో జీవ కణాలను పెంపు చేస్తుంది. దుర్బలులకు, సంతానం లేనివారికి, జననేంద్రియ వ్యాధులతో బాధపడేవారికి సోంప్‌ అమృతం లాంటిది. ఇది తినకూడని వారంటూ లేరు.

స్నాన చూర్ణం...

సోంపు గింజల పొడి చెంచాడు, తుంగముస్తల పొడి 2 చెంచాలు, కురువేరు పొడి 3 చెంచాలు, రాతిపువ్వు (స్టోన్‌ ఫ్లవర్‌) పొడి 4 చెంచాలు, లవంగాల పొడి 5 చెంచాలు... ఈ మోతాదులో కలిపితే జాజిపూలతో సమానమైన ‘స్నాన చూర్ణం’ తయావుతుంది. ఓ లీటర్‌ నీళ్లలో ఈ పొడిని రెండు చెంచాలు వేసి, ఆ నీటిని మరిగించి స్నానం చేసేప్పుడు బక్కెట్‌ నీళ్లలో కలిపితే పరిమళ భరితంగా ఉంటుంది. చర్మానికి పోషణ ఇస్తుంది.

చెంచా సోంపు గింజలతో టీ కాచుకుని తాగితే కడుపులో గడబిడ, ఉబ్బరం, మంట, త్రేన్పులు, ఎక్కిళ్లు, కడుపు నొప్పి, అరుచి, కడుపులో బరువుగా ఉండటం లాంటివన్నీ తగ్గుతాయి. నులి పురుగులు పోతాయి. మైగ్రేన్‌ తలనొప్పి ఉన్నవారు రోజూ శతపుష్ప టీ రెండు పూటలా తాగుతూ ఉంటే చాలా మార్పు కనిపిస్తుంది. సయాటికా నడుము నొప్పి, కీళ్ల నొప్పులున్నవారికి ఈ టీ బాగా ఉపయోగకరం. కఫం, గొంతులో మంట, దగ్గు లాంటి బాధలు కూడా తగ్గుతాయి. అప్పటికప్పుడు ముంచుకొచ్చే ఉబ్బసం, ఆయాసం ఆగుతాయి. ఇదంతా సోంపు గింజల ప్రయోజనానికి సంబంధించిన అంశం.

- గంగరాజు అరుణాదేవి

ఆకుకూర ఇలా...

క్షేమశర్మ ఈ మొక్క ఆకులతో కూర వండుకోవటం గురించీ, వాటి గుణాల గురించీ క్షేమశర్మ మాత్రమే విశ్లేషించాడు.

భర్జితా కటుతైలేనా సింధుజేనావమర్దితా! శతపుష్పా హసత్యేషా పరవాసవ్యపేక్షకమ్‌!

శతపుష్ప లేత ఆకుల్ని సేకరించి, కడిగి, పొడిబట్టతో శుభ్రపరచి, సన్నగా తరగండి. ఓ బాండీలో ఆవ నూనె వేసి, ఈ ఆకుల్ని కలిపి మూతబెట్టి సన్న సెగన మగ్గనివ్వండి. ఆకులు మెత్తబడ్డాక తగినంత ఉప్పు కారాలు చేర్చుకుంటే శతపుష్ప ఆకుకూర సిద్ధం అయినట్టే. దీన్ని పప్పుగా వండుకోవాలన్నా, పచ్చడిగా చేసుకోవాలన్నా, పెరుగు కలిపి తాలింపు పెట్టిన పెరుగుపచ్చడి చేసుకోవాలన్నా మౌలికంగా ఇలా మగ్గబెట్టడం అవసరం.

తీక్షణంగా పని చేస్తాయి...

శతపుష్ప ఆకులు వాము ఆకుల్లా కొద్దిగా కారపు రుచి కలిగి ఉంటాయి. స్నిగ్ధంగా అంటే జిడ్డుగా ఉంటాయి. తీక్షణంగా పని చేస్తాయి. అంటే తీసుకున్న వెంటనే శరీరం లోపల ధాతువులు అన్నింట్లోకి వేగంగా దీని ప్రభావం చొచ్చుకుపోతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. వాతాన్ని హరిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. కంటి చూపును పెంచుతుంది. ఈ ఆకుల్ని నీళ్లలో వేసి, చిక్కని కషాయం కాచి, ఎనీమా చేస్తే కడుపులో దోషాలు పోతాయి. శతపుష్ప నూరు ప్రయోజనాలు కలిగిన అద్భుతమైన మొక్క.

Updated Date - 2023-10-07T03:39:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising