Sexy 'Sequin' : సెక్సీ ‘సెక్విన్’
ABN, First Publish Date - 2023-01-18T02:50:42+05:30
సెక్సీ ‘సెక్విన్’ డిస్కో శకానికి చెందిన మెరుపుల ‘సెక్విన్’ ఫ్యాషన్ ట్రెండ్ తాజాగా ఊపందుకుంది. ఈవినింగ్ పార్టీల్లో మెరుపుతీగలా వెలిగిపోవడం కోసం సెక్విన్ చీరలు, డ్రస్సులతో సింగారించుకోండి.
సెక్సీ ‘సెక్విన్’ డిస్కో శకానికి చెందిన మెరుపుల ‘సెక్విన్’ ఫ్యాషన్ ట్రెండ్ తాజాగా ఊపందుకుంది. ఈవినింగ్ పార్టీల్లో మెరుపుతీగలా వెలిగిపోవడం కోసం సెక్విన్ చీరలు, డ్రస్సులతో సింగారించుకోండి.
సెక్విన్ షిఫాన్ చీరల మెరుపే వేరు. కాంట్రాస్ట్ కలర్ సెక్విన్లతో ఎంబ్రాయిడరీ చేసిన షిఫాన్ చీరలను పుట్టినరోజు వేడుకలు, మ్యారేజ్ డే ఫంక్షన్లకు ఎంచుకోవచ్చు.
ఈ షిమ్మరీ చీరలే కాదు, డ్రస్సులు కూడా అదరగొట్టేంత అందంగా ఉంటాయి. క్లబ్ లేదా పబ్‌కు హాజరయ్యేటప్పుడు సెక్విన్‌లు అద్దుకున్న ఫ్రాక్ లేదా షార్ట్ స్కర్క్ విత్ క్రాప్ టాప్ ఎంచుకోవచ్చు.
సెక్విన్ దుస్తులు మెరుస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని పగటి వేళ వేడుకల్లో ధరించకూడదు.
సెక్విన్ ప్యాంట్ సూట్స్ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ దుస్తులకు మ్యాచ్ అయ్యేలా హై పోనీ టెయిల్, లేయర్డ్ జ్యువెలరీ, క్రిస్టల్ ఎంబోజ్‌డ్ హీల్స్ ధరించాలి.
సెక్విన్ స్టేట్‌మెంట్ జాకెట్స్ కూడా మరింత ఫ్యాషనబుల్‌గా ఉంటాయి. అయితే మల్లీ కలర్ సెక్విన్ జాకెట్‌ను ఎంచుకుంటే ఎలాంటి డ్రస్సుకైనా ఇట్టే నప్పుతుంది.
Updated Date - 2023-01-18T02:50:43+05:30 IST