ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూరేకుల తేనీరు!

ABN, First Publish Date - 2023-02-02T02:27:40+05:30

‘‘బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మా టీ తాగండి..’’ రోజు వారి టెన్షన్ల నుంచి ఉపశమనం కావాలనుకుంటున్నారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మా టీ తాగండి..’’

రోజు వారి టెన్షన్ల నుంచి ఉపశమనం కావాలనుకుంటున్నారా? -అయితే మా టీ తాగండి’’

ఇలాంటి టీ ప్రకటనలు అనేకం చూస్తూ ఉంటాం. అలాంటి కొన్ని టీల వెనకున్న విశేషాలేమిటో చూద్దాం..

పసుపు టీ: మన శరీరంలో అంతర్గత అవయవాలలో

ఉన్న వాపులను తగ్గించటానికి పసుపు ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మనకు చాలా సులభంగా లభిస్తుంది కూడా! అందుకే పసుపుతో కూడిన టీ పొడులు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.

పసుపుతో కూడిన టీలకు మంచి డిమాండ్‌ ఉంది కూడా! చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని పసుపు టీ తాగమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

గడ్డిచామంతి టీ: గడ్డి చామంతిని ఆయుర్వేదం వైద్య చికిత్సలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో గడ్డి చామంతితో కూడిన టీ పౌడర్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. ఈ టీని తాగటం వల్ల ఆందోళన తగ్గి.. మంచి నిద్ర పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం నిద్రకు మాత్రమే కాకుండా.. జలుబు, రుతుస్రావ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

మందారం టీ: మందారం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకు చాలా కాలంగా తెలుసు. ఈ మధ్యకాలంలో మందార రేకులను టీ పొడితో కలిపి వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో బరువు తగ్గాలనుకొనే వారు ఈ తరహా టీని ఎక్కువగా తాగుతున్నారు. ఈ టీని ఉదయం తాగటం వల్ల బీపీ అదుపులో ఉంటుందని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - 2023-02-02T02:27:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising